ఆర్ఆర్ఆర్‌లో అమ్మడికి స్పెషల్ ట్రీట్‌మెంట్.. ఎవరో తెలుసా?

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం యావత్ భారతదేశ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

 Alia Bhatt Special Song In Rrr-TeluguStop.com

కాగా ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ చరణ్ సరసన హీరోయిన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే.

ఆమెకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుంది.

ఈ సినిమాలో ఆలియా పాత్ర చాలా తక్కువ నిడివితో ఉంటుందని, దీంతో ఆమె కోసం రాజమౌళి ఓ స్పెషల్ సాంగ్‌ను తెరకెక్కి్స్తున్నట్లు తెలుస్తోంది.ఆలియా భట్ పాత్రను హైలైట్ చేసేందుకే జక్కన్న ఈ స్పెషల్ సాంగ్‌ను చిత్రీకరిస్తున్నట్లు సినీ వర్గాలు అంటున్నాయి.

అటు తారక్‌కు జోడీగా ఒలివియా మారిస్‌కు మంచి పాత్ర ఉండటంతో ఆమెకు సరిసమానంగా ఆలియా భట్‌ను నిలబెట్టాలని రాజమౌళి ఈ నిర్ణయం తీసుకున్నాడట.

Telugu Alia Bhatt, Rajamouli, Ram Charan, Telugu-Gossips

తన సినిమాల్లో హీరోయిన్‌కు కూడా ప్రాధాన్యత ఇవ్వడంలో రాజమౌళి తనకు తానే సాటి అని మరోసారి ఆర్ఆర్ఆర్ ద్వారా నిరూపించుకుంటున్నాడని చిత్ర యూనిట్ తెలిపింది.ఇక బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్గన్ ఈ సినిమాలో తాజాగా జాయిన్ అయ్యాడు.ఆయనకు జోడీగా శ్రియా సరన్ నటిస్తోంది.

కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాను డివివి దానయ్య భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube