అడుగంటిన భూగర్భ జలాలు అన్నదాతలకు తప్పని తిప్పలు

నల్లగొండ జిల్లా:వర్షాలు పడక,సాగర్ నీళ్ళు లేక ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అన్నదాతల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.యాసంగి పంటలు కాపాడుకోవడం కోసం రైతులు కన్నతిప్పలు పడుతున్నారు.

భూగర్భ జలాలు పూర్తిగా పడి పోయి బోర్లు నోర్లు తెరవడంతో రైతులు ట్యాంకర్ల ద్వారా పంటలకు నీళ్లు అందిస్తూ ఉంటే,మరో పక్క నల్లగొండ జిల్లా మునుగోడు మండలం బట్లకాల్వ గ్రామానికి చెందిన నారగోని బక్కయ్య అనే రైతు డ్రిప్ సిస్టంలో మొక్కజొన్న సాగుచేశాడు.ఉన్న బోరు పోయక పంట ఎండిపోతుంటే తట్టుకోలేక మరో బోరు వేశాడు.

Adjacent Ground Water Is A Wrong Turn For Rice Farmers , Adjacent Ground Water,

పంటలను కాపాడే ప్రయత్నంలో అప్పులు చేయాల్సి వస్తుందని,అయినా పంట చేతికి రాకపోతే పరిస్థితి మరింత దారుణంగా మారే అవకాశం ఉందని వాపోతున్నాడు.కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రస్తుత పరిస్థితుల్లో అన్నదాతలకు అండగా ఉండాలని కోరుతున్నాడు.

ఇంటి పన్ను కట్టని ఇంటి ముందు మున్సిపల్ సిబ్బంది ధర్నా
Advertisement

Latest Suryapet News