Srinivas Reddy : నా వల్లే అతని కెరీర్ నాశనం అయింది: క్యారెక్టర్ ఆర్టిస్ట్ శ్రీనివాసరెడ్డి సంచలన కామెంట్స్..

యాక్టర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్ అయిన శ్రీనివాసరెడ్డి ఇడియట్, వెంకీ, డార్లింగ్ సినిమాలతో బాగా పాపులర్ అయ్యాడు.2014లో వచ్చిన గీతాంజలి సినిమాలో హీరోగా కూడా చేసి అలరించాడు.‘భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు’ సినిమాతో డైరెక్టర్‌గా అవతారం ఎత్తాడు.పాపులర్ కామెడీ సీరియల్ అమృతంలో దొంగగానూ కనిపించి నవ్వించాడు.

 Actor Srinivas About Comedian Siva Reddy-TeluguStop.com

బింబిసార, కార్తికేయ 2 సినిమాలతో ఇటీవల కాలంలో ఆకట్టుకున్న ఈ నటుడు తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు.శ్రీనివాసరెడ్డి( Srinivas Reddy )కి గతంలో బైక్ యాక్సిడెంట్ జరిగిన సంగతి తెలిసిందే.

పాలేరు సమీప ప్రాంతంలో కేశవాపురం వద్ద తన ఫ్రెండ్‌, సహ-నటుడు శివ( Shiva )తో కలిసి వెళుతుండగా యాక్సిడెంట్ జరిగింది.ఆ సమయంలో శ్రీనివాసరెడ్డి కాలు కూడా విరిగింది.

అందుకే ఇప్పటికీ అతను సరిగ్గా నడవలేడు.అయితే శ్రీనివాస్ రెడ్డికే కాకుండా అతని ఫ్రెండ్ శివకి కూడా రైట్ లెగ్ విరిగింది.

ముఖం దగ్గర స్వల్ప గాయం అయింది.స్థానికులు వెంటనే వారిద్దరినీ ఖమ్మం( Khammam )లోని ఒక ఆసుపత్రికి తరలించారు.

Telugu Srinivas Reddy, Bike, Karthikeya, Khammam, Psoriasis, Shiva, Tollywood-Mo

ఈ భయంకర ఘటన గురించి శ్రీనివాసరెడ్డి ఇటీవల మాట్లాడుతూ.“నా స్నేహితుడికి సోరియాసిస్ అనే వ్యాధి ఉంది.ఋతురాగాలు వంటి సీరియల్స్ మేం కలిసే చేశాం.నాతోనే కలిసి జర్నీ చేద్దామని శివ Shiva )ఎంతో అనుకున్నాడు.సోరియాసిస్ వ్యాధిని ఎలా తగ్గించుకోవాలో మా తండ్రికి చెప్పాలనుకున్నాడు.అందుకోసమే నాతో కలిసి ఖమ్మం బయలుదేరాడు.

కానీ దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదం జరిగింది.ఆ ప్రమాద గాయాలను నయం చేసుకోవడానికి ఇంగ్లీష్ మెడిసిన్ వాడాడు.

దానివల్ల సొరియాసిస్ ( Psoriasis )అతనికి ఎక్కువైంది.ఈ వ్యాధి వల్ల అతన్ని ఏ సినిమా దర్శకుడు తీసుకోలేదు.

సీరియల్ లో కూడా అవకాశాలు రాలేదు.అందువల్ల యాక్టింగ్ ఇండస్ట్రీకి అతను పూర్తిగా దూరం కావలసి వచ్చింది.

నా వల్లే అతడి కెరీర్ నాశనం అయ్యింది.ఆ నిజం నన్ను ఎప్పటికీ దహించి వేస్తుంది.” అని ఎమోషనల్ అయిపోయాడు.

Telugu Srinivas Reddy, Bike, Karthikeya, Khammam, Psoriasis, Shiva, Tollywood-Mo

ఏదైనా చేయగలను అంటే అది ముందుగా శివకే చేస్తానని, తన ఫ్రెండ్‌షిప్‌కి ఎంతో విలువ ఇస్తానని కూడా చెప్పాడు.ఈ మాటలు విన్న చాలా మంది ఎమోషనల్ అవుతున్నారు.ఇలా జరగకుండా ఉండాల్సింది అని కామెంట్లు పెడుతున్నారు.

శ్రీనివాస్ రెడ్డి స్నేహానికి ఇస్తున్న విలువను చూసి ఫిదా అవుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube