ఖరీదైన బంగ్లా కొనుగోలు చేసిన నటుడు మాధవన్... ధర ఎంతో తెలుసా?

సౌత్ సినిమా ఇండస్ట్రీలో నటుడిగా ఎన్నో విభిన్నమైన చిత్రాలలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పించిన వారిలో సీనియర్ నటుడు మాధవన్( Madhavan ) ఒకరు.ఈయన ఎన్నో అద్భుతమైన సినిమాలలో విభిన్న పాత్రలలో నటించారు .

 Actor Madhavan Buys New Luxury Home At Mumbai Details, Madhavan, Vedaanth Madhav-TeluguStop.com

అలాగే ప్రయోగాత్మక సినిమాలలో కూడా నటించి మెప్పించారు.ఈ విధంగా హీరోగా మాత్రమే కాకుండా ఈయన విలన్ పాత్రలలో కూడా కూడా నటించి ప్రేక్షకులను మెప్పించారు.

ఇక మాధవన్ చివరిగా బ్రీత్ అనే వెబ్ సిరీస్ లో నటించాడు.ఈ వెబ్ సిరీస్ అద్భుతమైన స్థాయిలో సక్సెస్ అయ్యింది.

ఈ విధంగా సినిమాలు వెబ్ సిరీస్ లు అంటూ  కెరియర్ పట్ల ఎంతో బిజీగా ఉన్న మాధవన్ తాజాగా ముంబైలో( Mumbai ) ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.ఇప్పటికే ఈయనకు చెన్నైలో ఖరీదైన బంగ్లాలు ఉన్నాయి.అంతే కాకుండా దుబాయ్ లో కూడా అత్యంత ఖరీదైన భవనాలు ఉన్నట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే తాజాగా ఈయన ముంబైలో కూడా ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది.

ముంబై లోని ఖరీదైన BKC ప్రాంతంలో 4182 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న విలాసవంతమైన ఇంటిని( Luxury House ) కొనుగోలు చేశారని తెలుస్తోంది.ఈ ఫ్లాట్ ఖరీదు సుమారు 18 కోట్ల రూపాయల విలువ చేస్తుందని తెలిసే అందరూ ఆశ్చర్యపోతున్నారు.ఇక ఈ విషయం తెలిసిన అభిమానులు ఈయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.ఎంతో బిజీగా గడుపుతున్నారు.ఇక మాధవన్ కుమారుడు గురించి కూడా అందరికీ తెలిసిందే అయితే ఈయన స్విమ్మింగ్ లో రాణిస్తూ ఎన్నో అద్భుతమైన పథకాలను తీసుకువస్తూ మన దేశ కీర్తి ప్రతిష్టలను పెంచుతున్న సంగతి మనకు తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube