అక్రమంగా చెరువుల నుండి నీటిని తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి

సూర్యాపేట జిల్లా: మునగాల( Munagala ) మండల పరిధిలోని తాడువాయి గ్రామం పరిధిలోని ఎర్రచెరువు మొద్దుల చెరువులలో నీటిని మోటర్ల ద్వారా అక్రమంగా బయటకు తరలిస్తున్న వారిపై చట్టరిత్యా చర్యలు తీసుకోవాలని బీజేపీ మునగాల మండల అధ్యక్షులు కృష్ణప్రసాద్( Krishnaprasad ) బుధవారం మండల ఇన్చార్జి తాహాసిల్దార్ జవహర్ నాయక్ కు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాడువాయి గ్రామ పరిధిలోని ఎర్రచెరువు, మొద్దులచెరువులలో చేపలను పట్టుకోవడం కొరకు కాంట్రాక్టర్లు చెరువులో ఉన్న నీటిని అక్రమంగా మోటార్ల ద్వారా తూములను పగలగొట్టి బయటకు పంపిస్తున్నారని అన్నారు.

అసలే ఎండాకాలం ఎండలు మండిపోతున్నాయి.పరిసర ప్రాంతాల్లోని పశు పక్ష్యాదులకు త్రాగునీరు లేకుండా చేస్తున్నారని అవేదన వ్యక్తం చేశారు.

Action Should Be Taken Against Those Illegally Diverting Water From Ponds , Kris

ఎర్రచెరువు నుండి తాడువాయి గ్రామ ప్రజలకు తాగునీటిని అందిస్తున్న పరిస్థితి ఉందని,ఇలాంటి పరిస్థితిలో చెరువుల్లో నీటి వృథాగా పంపిస్తే ప్రజలకు అనేక ఇబ్బందులు ఎదురవుతాయన్నారు.ఇప్పటికైనా అధికారులు స్పందించి నీటిని అక్రమంగా బయటకు పంపిస్తున్న కాంట్రాక్టర్ పై చర్య తీసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్త జిల్లేపల్లి వెంకటేశ్వర్లు, లొడంగి మహేష్ పాల్గొన్నారు.

Advertisement
కానిస్టేబుల్ రాంబాబు మృతి బాధాకరం : ఎస్పీ నరసింహ

Latest Suryapet News