టార్గెట్ మార్చుకున్న ఆచార్య..?

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆచార్య కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ వర్గాల్లో కూడా అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి.

 Acharya Movie To Change Release Date, Acharya, Chiranjeevi, Ram Charan, Tollywoo-TeluguStop.com

ఇక ఈ సినిమాలో మెగాస్టార్ అల్ట్రా స్టైలిష్ లుక్‌తో మెగా ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చేసేందుకు రెడీ అవుతుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని వారు ఆసక్తిగా చూస్తున్నారు.కాగా ఈ సినిమాను వేసవి కానుకగా మే 13న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇటీవల అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.

అయితే ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో చిత్ర యూనిట్ మరో నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.ఇంకా షూటింగ్ పూర్తి కాకపోవడంతో ఆచార్య చిత్రాన్ని మే 13న కాకుండా వేరే తేదీలో రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.

దీంతో ఈ సినిమాను మే 28న రిలీజ్ చేస్తే బాగుంటుందని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.అయితే ఆ సమయంలో మరో రెండు స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అవుతుండటంతో బాక్సాఫీస్ వద్ద క్లాష్ తప్పదని అభిమానులు భావిస్తున్నారు.

మాస్ రాజా రవితేజ ఖిలాడి నందమూరి బాలకృష్ణ నటిస్తున్న బిబి3చిత్రాలు కూడా మే 28న రిలీజ్ అవుతుండటంతో ఈ రెండు సినిమాలకు ఆచార్య గట్టి పోటీనివ్వడం ఖాయమని తెలుస్తోంది.

మరి సమ్మర్ క్లాష్ నుండి ఆచార్య వెనకడుగు వేస్తాడా లేక తెగించి బరిలోకి దూకుతాడా అనేది ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.

ఇక ఆచార్య చిత్రంలో చిరుతో పాటు ఓ కేమియో రోల్‌లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.తాజాగా ఆయన లుక్‌కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో దుమ్ములేపుతున్నాయి.

ఇక ఈ సినిమాలో అందాల భామ కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోండగా మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube