లిక్కర్ స్కాంలో కోర్టు ఎదుటకు ఆప్ ఎంపీ సంజయ్ సింగ్..!!

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసుపై ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్న ఈడీ తాజాగా ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.ఎంపీ అరెస్ట్ నేపథ్యంలో ఢిల్లీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.

 Aap Mp Sanjay Singh To Appear In Court In Liquor Scam..!!-TeluguStop.com

అయితే ఇవాళ ఎంపీ సంజయ్ సింగ్ ను ఈడీ అధికారులు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.ఈ క్రమంలో ఆయనను అధికారులు కస్టడీకి కోరే అవకాశం ఉంది.

మరోవైపు సంజయ్ సింగ్ అరెస్ట్ నేపథ్యంలో ఢిల్లీ ఈడీ కార్యాలయం వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు.నిన్న సాయంత్రం సంజయ్ సింగ్ ను ఈడీ అరెస్ట్ చేయగా రాత్రంతా ఆయన ఈడీ కార్యాలయంలోనే ఉన్నారు.

అటు సంజయ్ సింగ్ అరెస్ట్ ను వ్యతిరేకిస్తూ ఆప్ నేతలు బీజేపీ కార్యాలయం వద్ద నిరసన చేసేందుకు సిద్ధం అవుతున్నాయని తెలుస్తోంది.ఈ మేరకు ఆమ్ ఆద్మీ శ్రేణులు భారీగా తరలివస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube