బర్రెలను తప్పించబోయి రోడ్డు పక్కకు దూసుకెళ్లిన ట్రావెల్ బస్సు

సూర్యాపేట జిల్లా:మునగాల మండల( Munagala mandal ) కేంద్రంలో మంగళవారం ఉదయం హైద్రాబాద్-విజయవాడ 65వ జాతీయ రహదారిపై రెయిన్ బో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి రహదారి పక్కకు దూసుకెళ్ళింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్ నుంచి అమలాపురం వెళ్తున్న బస్సు సూర్యాపేట జిల్లా( Suryapet District ) మునగాల మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలోకి రాగానే సడన్ గా గేదెలు అడ్డు రావడంతో వాటిని తప్పించబోయి పక్కకు దూసుకెళ్లింది.

ఈ ప్రమాదం సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉండగా పలువురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.ప్రమాద తీవ్రత లేకపోవడంతో అందరూ ఊపిరి పిల్చుకున్నారు.

A Travel Bus Which Ran Off The Road After Avoiding The Buffalo , Munagala Mandal

Latest Suryapet News