వైరల్ వీడియో: మాస్ స్టెప్పులతో పెళ్లి మండపాన్ని షేక్ చేసిన పెళ్లికూతురు..

ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు ఇంట్లోని వివాహ వేడుకలకు( Wedding Celebrations ) సంబంధించి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసి వారి బంధు మిత్రులందరికీ గ్రాండ్ గా చేసుకుంటున్నారు.ఇక ఈ పెళ్లి కార్యక్రమంలో సంగీత్, మెహందీ, బారత్ అంటూ ఒక్కొక్క కార్యక్రమంలో ఆటలు, పాటలు, డాన్సులు ఇలా ఇది వీలైతే అది చేస్తూ ప్రతి మూమెంట్ ను ఎంజాయ్ చేస్తున్నారు.

 Bride Sets Wedding Stage On Fire With Her Girl Squad Viral Video,mass Steps, Bri-TeluguStop.com

ఇక ఈ మధ్యకాలంలో మరీ ముఖ్యంగా వధూవరులు( The Bride and Groom ) ఇద్దరు వారి వెడ్డింగ్ డే ను స్పెషల్ గా మార్చుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు.ఈ క్రమంలోనే చాలామంది దంపతులు వెళ్లి చేసుకునే స్టేజి పైనే స్టెప్పులు వేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.


ఇకపోతే ఎందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో( Social Media ) ఎప్పటికప్పుడు వైరల్ గా మారుతూనే ఉంటాయి.తాజాగా ఈ లిస్టులోకి ఓ పెళ్లికూతురు వేసిన డాన్స్( Bride Dance ) వీడియో చేరింది.కన్నడ హీరో కిచ్చ సుదీప్ నటించిన విక్రాంత్ రానా సినిమాలోని రా.రా.రక్కమ్మ.( Ra Ra Rakkamma Song ) అనే పాటకు పెళ్లికూతురు మాస్ స్టెప్పులు వేసి అందరిని ఆశ్చర్యపరిచింది.

పెళ్లికూతురుతో పాటు స్టేజిపై ఆమె స్నేహితురాలతో కూడా మాస్ స్టెప్స్ వేయించి ఔరా అనిపించింది.ఇక వారందరూ డాన్స్ చేస్తుండగా పెళ్లి కొడుకు మాత్రం కుర్చీలో కూర్చుని అమ్మాయిల డాన్స్ ని ఎంజాయ్ చేశాడు.


ఇక ఈ వీడియోకు సంబంధించి నెటిజెన్స్ కాస్త ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు.కొందరేమో అచ్చం ఇలాంటి అమ్మాయి నాకు భార్యగా రావాలంటూ కోరుతుండగా.మరి కొందరైతే నాకు మాత్రం ఇలాంటి అమ్మాయి అస్సలు వద్దు అంటూ కామెంట్ చేస్తున్నారు.మరికొందరు నెటిజెన్స్ వీరిద్దరికీ.జీవితంలో మీరు కూడా ఇలాగే సంతోషంగా ముందుకెళ్లాలంటూ కామెంట్ చేస్తున్నారు.ప్రస్తుతం అమ్మాయి చేసిన డాన్స్ వీడియో( Viral Dance Video ) సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.

అయితే ఈ వీడియో ఎక్కడిదన్న విషయం మాత్రం వెలుగులోకి రాలేదు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube