ఉచిత పథకాలపై వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు

ఉచిత పథకాలపై మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ( Venkaiah Naidu )కీలక వ్యాఖ్యలు చేశారు.కొన్ని పార్టీలు ఇష్టారాజ్యంగా ఉచిత పథకాల హామీలు ఇస్తున్నాయని తెలిపారు.

 Key Comments Of Venkaiah Naidu On Free Schemes, Venkaiah Naidu, Free Education A-TeluguStop.com

అయితే విద్య, వైద్యం ఉచితంగా ఇస్తే తప్పులేదని వెంకయ్య నాయుడు చెప్పారు.కానీ రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసే ఉచితాలు సరికాదని పేర్కొన్నారు.

ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.అయితే వెంకయ్య నాయుడు గతంలోనూ ఉచిత పథకాలపై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

ఏ రాష్ట్రంలోనైనా ఎన్నికలు వచ్చాయంటే చాలు ఆయా పార్టీలు తమ మ్యానిఫెస్టో( Manifesto )లో ఉచిత పథకాలను చేర్చి ప్రజలను మభ్య పెడుతుంటారని చెప్పారు.అదేవిధంగా రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను అంచనా వేయకుండా ఉచిత పథకాలను ప్రకటించి ఓటర్లను ఆకర్షిస్తారని ఆయన వ్యాఖ్యానించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube