డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ఎంపికపై సమగ్ర విచారణ జరిపించాలి: సిపిఎం

సూర్యాపేట జిల్లా:మోతె మండలం రావిపహాడ్ గ్రామంలో ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారుల (Double bedroom ) ఎంపికలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరిపి, అనర్హులను తొలగించి, అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్స్ కేటాయించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మోతె మండలం( Mothey mandal ) రావిపహాడ్ గ్రామానికి చెందిన పేదలు బుధవారం కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి రావిపహాడ్ గ్రామపంచాయతీలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరిగాయని ఆరోపించారు.

అర్హులైన వారికి కాకుండా వ్యవసాయ భూములు, ఇండ్ల స్థలాలు,ఆర్థికంగా ఉన్నవారికి ప్రభుత్వ నిబంధన ప్రకారం ఇల్లు కేటాయించకూడదని నిబంధనలు ఉన్నప్పటికీ, ఆ నిబంధనలను తుంగలోకి తొక్కి అధికారులు,రాజకీయ నాయకులు కుమ్మక్కై డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక లో అనహర్హులకు చోటు కల్పించారన్నారు.వెంటనే అధికారులు గ్రామంలో పర్యటించి సమగ్ర విచారణ చేపట్టి అనహర్హులను తొలగించి వారి స్థానంలో అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.

A Thorough Inquiry Should Be Conducted On The Selection Of Double Bedroom Houses

లేనియెడల సిపిఎం పార్టీ( CPM ) ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టరేట్ ఏవో శ్రీదేవికి సమర్పించారు.

ఈ కార్యక్రమంలో రావిపహాడ్ గ్రామ పేదలు వెలుగు మధు చేగువేరా,గోపగాని లక్ష్మయ్య,సండ్ర మధు, ఇట్టమల్ల మాణిక్యమ్మ, కల్లెపెల్లి సుగుణమ్మ, పెరుమళ్ళ నాగమణి, ఐతరాజు జానమ్మ, గోపగని సతీష్,గోపగాని లింగయ్య,మోత్కూరి వెంకటాచారి,అక్కినపెళ్లి సోమాచారి,అక్కినపెల్లి సైదాచారి,పొడపంగి దుర్గమ్మ,పప్పుల సృజన, పొడపంగి అలివేల, పడిదల ఎల్లమ్మ,పిల్లుట్ల ఉప్పమ్మ,పగిళ్ల భద్రమ్మ, బుల్లెట్ ఎల్లమ్మ, దేవదానం,కుంచం గోపయ్య,బాపనపల్లి నాగయ్య,పొడపంగి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Latest Suryapet News