వైకల్యం శాతన్ని బట్టి కాకుండా వికలాంగులకు ఒకే యుడిఐడి కార్డు జారీ చేయాలి

సూర్యాపేట జిల్లా: వికలాంగుల వైకల్య ధ్రువీకరణ పత్రాలు పొందెందుకు నిబంధనలను కఠినతరం చేస్తూ 2016 ఆర్పీడబ్ల్యూడి చట్టంలోని సెక్షన్ 20కి సవరణలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ముసయిదాను నోటిఫికేషన్ గెజిట్ ను రద్దు చేయాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్పీఆర్డీ) జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అర్వపల్లి లింగయ్య, వీరబోయిన వెంకన్న గురువారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.

ట్రైని ఐఏఎస్ పూజా ఖేడ్కర్ పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో వైకల్య ధ్రువీకరణ పత్రం పొందెందుకు నిబంధనలు కఠినంతరం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం సరైంది కాదన్నారు.

ఇప్పటి వరకున్న నిబంధనల ప్రకారం వైకల్య ధ్రువీకరణ పత్రం కోసం దరఖాస్తుదారులు నివాస రుజువు మరియు ఫోటో మాత్రమే సమర్పించాలన్నారు.సవరించిన నిబంధనల ప్రకారం 6నెలల లోపు దిగిన ఫోటో, ఆధార్ కార్డు తప్పని సరిగా సమర్పించాలన్నారు.

A Single UDID Card Should Be Issued To The Disabled Not On The Basis Of The Perc

వైకల్య ధ్రువీకరణ పత్రాల కోసం దరఖాస్థులను స్వీకరించడానికి మరియు ప్రాసెస్ చేయడానికి వైద్య అధికారులు మాత్రమే సమర్థులుగా పరిగణించాలని ముసాయిదాలో సవరణలు ప్రతిపాదించడం సరైంది కాదన్నారు.దరఖాస్థులను ప్రాసెస్ చేయడానికి పట్టే సమయాన్ని 1నెల నుండి 3నెలలకు పెంచాలని, ప్రతిపాదన చేయడం అంటే వికలాంగులను ఇబ్బందులకు గురిచేయడమే అవుతుందన్నారు.

ప్రభుత్వం చేస్తున్న సవరణలు నకిలీ వైకల్య ధ్రువీకరణ పత్రాలు పొందకుండా ఆపలేవని, ప్రభుత్వం కొత్తగా పెడుతున్న నిబంధనలు నిజమైనా వికలాంగులు సర్టిఫికెట్ పొందడం కష్టమవుతుందన్నారు.గత సంవత్సరం కేంద్ర ప్రభుత్వం వికలాంగులు సంక్షేమ పథకాలు పొందాలంటే యుడిఐడి కార్డు తప్పని సరిగా ఉండాలని,యుడిఐడి కార్డు కు ఆధార్ అనుసంధానం చేయాలని నిర్ణయం చేసిందని ప్రస్తుతం యుడిఐడి కార్డు జారీ చేయడానికి 6నెలల కంటే ఎక్కువ సమయం పడుతుందనారు.యుడిఐడి కార్డులు జారీ చేయడానికి మరియు వైకల్య ధ్రువీకరణ పత్రం జరిచేయడానికి కావాల్సిన సమయాన్ని తగ్గించకుండా ఎందుకు పెంచుతున్నారని ప్రశ్నించారు.2016RPWD సెక్షన్ 18(2)ప్రకారం దరఖాస్తు స్వీకరించిన నెలలోపు సర్టిఫికెట్స్ జారీ చేయాలని వైద్య అధికారులను ఆదేశిస్తుందని,మారిన సవరణ ప్రకారం వైకల్యం నిర్ధారణ అయితేనే 3 నెలలలోపు సర్టిఫికెట్ జారీ చేయాలని సూచిస్తుందని అన్నారు.వైకల్య శాతన్ని బట్టి యుడిఐడి కార్డులు జారీచేయాలని,40 శాతం లోపు ఉన్నా వారికి తెలుపు కార్డు,40-80 శాతం వైకాల్యం ఉన్నవారికి పసుపు కార్డు, మరియు 80 నుండి 100 శాతం ఉన్నావారికి బ్లూ కార్డులు జారీ చేయాలని చేసిన ప్రతిపాదన సరైనది కాదన్నారు.

Advertisement

యుడిఐడి కార్డులు వైకల్య శాతన్ని బట్టి కలర్లో జారిచేయడం అంటే వికలాంగుల మధ్య శత్రుత్వం పెరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.సాటి వికలాంగుల మధ్య వివక్షత మరియు వేధింపులు పేరిగే అవకాశం ఉందని, యుడిఐడి కార్డులో వికలాంగుల పూర్తి సమాచారం ఉంటుందని,అలాంటప్పుడు వైకల్య శాతం ఎందుకు బహిరంగoగా కనిపించేలా చేయాలని ప్రశ్నించారు.

కేంద్ర ప్రభుత్వ నిర్ణయం వికలాంగులకు మరిన్ని సమస్యలను తెచ్చిపెడుతుందని, దరఖాస్తు చేసిన 2 సంవత్సరాలలోపు సర్టిఫికెట్ రాకుంటే మళ్ళీ కొత్తగా దరఖాస్తూ చేయాలని ప్రతిపాదన చేయడం అంటే వికలాంగులను మరింత ఇబ్బందులకు గురిచేయడమే అవుతుందన్నారు.కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ రద్దు చేయాలని,వైకల్య ధ్రువీకరణ పత్రం పొందడానికి మార్గదర్శకాలు సులభతరం చేయాలని డిమాండ్ చేశారు.

Advertisement

Latest Suryapet News