ఎలక్షన్స్ టైం దగ్గర పడుతున్న కొద్ది అన్ని పార్టీలలో గందరగోళం మొదలైంది.టికెట్ల విషయంలో వచ్చినటువంటి గొడవలు నేతలను పార్టీలు మారేలా చేస్తున్నాయి.
కాంగ్రెస్ (Congress) నుంచి బీఆర్ఎస్కు (BRS)బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కు వలసలు పెరిగిపోతున్నాయి.
తాజాగా మైనంపల్లి హనుమంతరావు(Mynampally Hanumantharao) కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే.
అంతేకాకుండా ఇంకొంతమంది నేతలు కూడా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.ఇలా కాంగ్రెస్ కి వలసలు పెరుగుతున్న తరుణంలో మెదక్(medak)కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది.
కాంగ్రెస్ పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షులు తిరుపతిరెడ్డి(Thirupathireddy) పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ఒక లేఖ విడుదల చేశారు.మరి ఆయన రాజీనామా ఎందుకు చేశారు అనే విషయాలు చూద్దాం.
కాంగ్రెస్ పార్టీలో గత పది సంవత్సరాలుగా పార్టీ పటిష్టత కోసం పాటుపడ్డానని ఆయన లేఖలో వ్రాసుకొచ్చారు.
పార్టీలో త్యాగాలు చేసిన వారిని గుర్తించకుండా, డబ్బుల సంచులే ప్రథమ అవధిగా కనిపిస్తున్నాయని అన్నారు.పార్టీ కోసం పాటుపడుతూ ఎన్నో సార్లు జైలు జీవితాలు అనుభవించి ఇప్పటికీ కేసుల వెంబడి తిరుగుతున్నానని, కానీ కాంగ్రెస్ పార్టీకి జీవితకాలం వ్యతిరేకంగా పనిచేసిన వారికి, ఇక్కడి నాయకత్వం అప్పగించడం చూస్తుంటే కాంగ్రెస్(Congress )వారి చేతిలో బందీ అయిపోయిందని అర్థమవుతుందని అన్నారు.నోట్ల కట్టలు ఇచ్చేవారికి టికెట్లు కేటాయిస్తే తెలంగాణ రాష్ట్రాన్ని ఆత్మగౌరవాన్ని, నడిబజారులో నవ్వుల పాలు చేయడం ఖాయమని ఆరోపించారు.
పార్టీలో ప్రజాబలం ప్రతిపాదికన కాకుండా కేవలం ధన బలానికే ప్రాధాన్య తీస్తున్నారు.ఇలాంటి వాటిపై ఏఐసిసి అధ్యక్షులతో పాటు సోనియా గాంధీ (Sonia Gandhi) రాహుల్ గాంధీ(Rahul Gandhi)కూడా మౌనం పాటించడం నాకెంతో బాధ కలిగిస్తుంది.నిఖాస్తైనా కాంగ్రెస్ కార్యకర్తగా ఇలాంటి పరిణామాలను జీర్ణించుకోలేక పార్టీకి రాజీనామా చేస్తున్నానని రాజీనామా పత్రాన్ని విడుదల చేశారు కంటారెడ్డి తిరుపతిరెడ్డి(Kantareddy Thirupathireddy).ప్రస్తుతం ఆయన రాజీనామా పత్రం సోషల్ మీడియాలో వైరల్ గా
.