విశాఖ జిల్లా( Visakhapatnam )లోని నక్కపల్లి మండలం చీడిక సమీపంలో ఈనెల 18వ తేదీ దోసలపాడు గ్రామానికి చెందిన కొల్లి సూరిబాబు (49) అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు.కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు అనుమానం, వ్యక్తిగత కక్షలే దారుణ హత్యకు కారణం అని తేల్చారు.
అందుకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.వివరాల్లోకెళితే.
దోసలపాడు( Dosalapadu ) గ్రామానికి చెందిన కొల్లి సూరిబాబు (48) ఈనెల 18వ తేదీ మేకల మందను మేపడానికి పొలం వెళ్ళాడు.రాత్రి మేకల మంద ఇంటికి చేరిన సూరిబాబు మాత్రం ఇంటికి రాలేదు.
దీంతో సూరిబాబు కుమారుడు శివాజీ 19వ తేదీ ఉదయం పొలాలలో తండ్రి కోసం వెతుకగా చీడిక శివారులో తండ్రి మృతదేహం కనిపించింది.వెంటనే శివాజీ పోలీసులకు సమాచారం అందించాడు.
సీఐ జి.అప్పన్న ఆధ్వర్యంలో ఎస్సై జి.శిరీష విచారణ ప్రారంభించారు.సూరి బాబుకు అదే గ్రామానికి చెందిన కొల్లి రమణతో భూ తగాదాలు ఉన్నాయి.
ఈ మధ్యనే కొల్లి రమణకు చెందిన గేదకు పుట్టిన దూడ మరణించింది.ఆ తర్వాత రెండు మేకలు, ఒక గేదె చనిపోయాయి.
చెడుపు పెట్టడంతో ఈ పశువులు మరణించాయని.ఇందుకు సూరిబాబు కారణం అని రమణకు అనుమానం వచ్చింది.
18వ తేదీ మేకల మందను మేపడానికి వెళ్ళిన సూరి బాబుకు కొల్లి రమణ ఎదురుపడ్డాడు.ఇద్దరి మధ్య కాసేపు మాటల యుద్ధం జరిగింది.రమణ క్షణికావేశంలో ఓ రాయితో సూరిబాబు తలను బలంగా కొట్టడంతో.సూరిబాబు కుప్పకూలి అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు.హత్య అనంతరం తనకేమి తెలియనట్టు రమణ( Ramana ) ఇంటికి వెళ్ళిపోయాడు.పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేయగా తాను కచ్చితంగా దొరికిపోతానని భావించిన రమణ వీఆర్వో వద్ద లొంగిపోయాడు.
రమణను అదుపులోకి తీసుకున్న పోలీసులు రిమాండ్ కు తరలించారు.