ఇదేం ఆర్ట్ అయ్యా బాబోయ్.. నాలుకతో విరాట్ కోహ్లీ బొమ్మ గీసేశాడు...

ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది అభిమానులు ఉన్న పాపులర్ క్రికెటర్ విరాట్ కోహ్లీ( Virat Kohli )ఈ ప్లేయర్ బ్యాటింగ్ స్కిల్స్ అద్భుతంగా ఉంటాయి.ఈ స్టార్ క్రికెటర్ ఇటీవల వన్డేల్లో అత్యంత వేగంగా 13 వేల పరుగులు చేసిన క్రికెటర్‌గా నిలిచాడు.

 A Man Drawn Virat Kohli Figure By The With His Tongue Viral , Drawing Port-TeluguStop.com

అతను దీన్ని 267 ఇన్నింగ్స్‌ల్లో చేశాడు, ఇది గతంలో ఈ రికార్డును కలిగి ఉన్న సచిన్ టెండూల్కర్ కంటే 54 ఇన్నింగ్స్‌లు తక్కువ.కోహ్లి యంగ్ ఏజ్ లోనే ఈ ఫీట్ సాధించినందున అతను చాలా గొప్ప అని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

కోహ్లీ వయస్సు కేవలం 33 సంవత్సరాలు, ఇంకొక ఐదు నుంచి పది ఏళ్ల వరకు అతడు క్రికెట్లో కొనసాగవచ్చు.కింగ్ కోహ్లీ ఇప్పటికే అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లలో ఒకరిగా పరిగణించబడ్డాడు.

అతను మరింత మెరుగవుతున్నాడు.

కోహ్లీ వన్డేల్లో 47వ సెంచరీని కూడా నమోదు చేశాడు.దీంతో అత్యధిక వన్డే సెంచరీలు చేసిన టెండూల్కర్ రికార్డును బ్రేక్ చేయడానికి అతను రెండు సెంచరీలు దూరంలో ఉన్నాడు.ఇటీవల జరిగిన ఇండియా-పాకిస్థాన్‌ మ్యాచ్ లో కోహ్లి రన్స్‌తో భారత్ 356/2 భారీ స్కోరు నమోదు చేసింది.

అదే ఇన్నింగ్స్‌లో కేఎల్ రాహుల్( KL Rahul ) కూడా సెంచరీ సాధించాడు.మూడో వికెట్‌కు అజేయంగా 233 పరుగులు జోడించిన కోహ్లీ, రాహుల్ మధ్య భాగస్వామ్యం ప్రత్యేకంగా చెప్పుకోదగినది.

ఈ పార్ట్‌నర్‌షిప్ ఆసియా కప్ చరిత్రలో అత్యధికంగా చరిత్రలో నిలిచిపోయింది.

అయితే కోహ్లీ మీద అభిమానంతో ఒక వ్యక్తి తన అరుదైన ప్రతిభతో ఒక బొమ్మ గీశాడు.ఈ అభిమాని తన నాలుకతో విరాట్ కోహ్లీ డ్రాయింగ్ గీసిన వీడియో వైరల్‌గా మారింది.ఆ ఆర్టిస్ట్, కాన్వాస్‌పై పోర్ట్రెయిట్‌ను రూపొందించడానికి బ్లాక్ పెయింట్‌ను ఉపయోగించాడు.

నాలుకతోనే చేయితో గీసినంత గొప్పగా అతడు బొమ్మ గీసాడు.ఈ వీడియో 18 లక్షల వ్యూస్ సంపాదించింది.

ఈ ప్రతిభ చూసి కొందరు అద్భుతం అని కామెంట్ చేస్తే, మరి కొందరు ఇదేం టాలెంట్ అయ్యా బాబోయ్ అంటూ సరదాగా కామెంట్లు చేశారు.ఈ వీడియోను ముఫద్దల్ వోహ్రా ట్విట్టర్‌లో షేర్ చేశారు.

వోహ్రా క్రికెట్‌ను కవర్ చేసే స్పోర్ట్స్ జర్నలిస్ట్.‘అభిమాని తన నాలుకతో విరాట్ కోహ్లి చిత్రపటాన్ని చిత్రించాడు’ అని ఆ వీడియోకు క్యాప్షన్ ఇచ్చాడు.

వీడియో వెంటనే వైరల్ అయ్యింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube