నేరేడుచర్లలో ఉరి వేసుకుని వ్యక్తి మృతి

సూర్యాపేట జిల్లా: నేరేడుచర్ల పట్టణంలోని చింతబండ కాలనీకి చెందిన ఎడ్ల సైదులు (44) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు నేరేడుచర్ల ఎస్ఐ రవీందర్ నాయక్ తెలిపారు.

ఎస్ఐ తెలిపిన వివరాలు ప్రకారం.

కుటుంబ ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడంతో మనస్తాపం చెందిన సైదులు సోమవారం రాత్రి తన ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కి చీరతో ఉరివేసుకొని మరణించాడని చెప్పారు.అనంతరం మిర్యాలగూడ ఏరియా హాస్పిటల్ కి తీసుకెళ్తే,అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్ తెలిపారని,భార్య జానమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.

A Man Died By Hanging Himself In The Nareduchar , Nareduchar , Man Died , SI Sai

Latest Suryapet News