పెంచికల్ దిన్నె ఊర చెరువు కబ్జాపై సమగ్ర సర్వే

సూర్యాపేట జిల్లా( Suryapet District ):నేరేడుచర్ల మండలం పెంచికల్ దిన్నె గ్రామ ఊర చెరువు (ఆక్రమణ)కబ్జాపై ఎట్టకేలకు ఇరిగేషన్ శాఖ అధికారులు స్పందించారు.

ఇరిగేషన్ ఏఈ రాజేశ్వరి ( AE Rajeshwari )పర్యవేక్షణలో మండల సర్వేయర్ గాయత్రి ఊర చెరువు విస్తీర్ణాన్ని సర్వే నిర్వహించారు.

ఈ సందర్భంగా ఇరిగేషన్ అధికారులు మాట్లాడుతూ చెరువు విస్తీర్ణాన్ని పూర్తిగా సర్వే చేశామని,సర్వే పూర్తి వివరాలను త్వరలో వెల్లడించి,చెరువు చుట్టూ హద్దులు ఏర్పాటు చేస్తామని తెలిపారు.అనంతరం సొసైటీ సభ్యులు మాట్లాడుతూ చెరువు చుట్టు పక్కల రైతులు ఆక్రమణలకు పాల్పడుతున్నారని,గతంలో జిల్లా కలెక్టర్,తహశీల్దార్, ఇరిగేషన్ అధికారులకు చెరువు సొసైటీ సభ్యులు, రైతులు,యువకులు కలిసి పలుమార్లు దరఖాస్తులు ఇచ్చామన్నారు.

స్పందించిన ఇరిగేషన్ అధికారుల ( Irrigation authorities )సిఫారసు మేరకు చెరువు చుట్టూ సర్వే నిర్వహించడం పట్ల సొసైటీ సభ్యుల,రైతుల,గ్రామస్తుల పోరాటం ఫలించిందన్నారు.ఈ కార్యక్రమంలో ఇంజమూరు వెంకటయ్య,భార్గవ,సైదులు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

పవన్ కళ్యాణ్ నీ లాంచ్ చేయడం కోసం చిరంజీవి ఇంత భారీ ప్లాన్ చేశారా ?
Advertisement

Latest Suryapet News