ప్రధాని నరేంద్ర మోడీ వెలుగు తగ్గిపోయిందా? అవును….తగ్గిపోయిందని అనిపిస్తున్నది అన్నారు ఒక బడా పారిశ్రామికవేత్త.
ఆయన పేరు రాహుల్ బజాజ్.అతి పెద్ద కార్పోరేట్ సంస్థ అయిన బజాజ్ గ్రూప్ అధినేత.ఈయన రాజ్య సభ సభ్యుడు కూడా.2014లో ఒక చక్రవర్తిని చూసామని, కాని ఇప్పుడు ఆ వెలుగు కబడటం లేదని అన్నారు.గత 20-30 సంవత్సరాలలో ప్రపంచంలోని కొన్ని చోట్ల మాత్రమే కొందరు ఘన విజయాలు సాధించారని , అలాంటి వారిలో మోడీ ఉన్నారని అన్నారు.తను ఈ ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని, కానీ మోడీ ప్రభ తగ్గిందని చెప్పారు.
ప్రతి ఒక్కరు ఇదే మాట అంటున్నారని బజాజ్ అన్నారు.మోడీ వెలుగు తగ్గిందని దిల్లి అసెంబ్లీ ఎన్నికలు, బెంగాల్ పంచాయతి ఎన్నికల ఫలితాలు తెలియచేసాయన్నారు.
బీహార్లో అధికారంలోకి రావచ్చని అనుకుంటున్నానని బజాజ్ చెప్పారు.కొన్ని రాష్ట్రాల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందన్నారు.
మోడీ మీద ఇది బజాజ్ వ్యక్తిగత అభిప్రాయమే అయినా మోడీ ఇమేజ్ తెలియచేస్తున్నది.
.