మెగా పవర్ స్టార్ రామ్ చరణ్( Ram Charan ) ఇటీవల గేమ్ ఛేంజర్( Game Changer ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసినదే.శంకర్( Shankar ) దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో పూర్తిగా విఫలమైంది.
దీంతో శంకర్ డైరెక్షన్ పై విమర్శలు కూడా చేస్తున్నారు.ఇదిలా ఉండగా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా రామ్ చరణ్ బాలకృష్ణ( Balakrishna ) హోస్ట్ గా వ్యవహరించిన అన్ స్టాపబుల్ కార్యక్రమానికి( Unstoppable Show ) హాజరయ్యారు.
ఈ కార్యక్రమాన్ని రెండు భాగాలుగా విడుదల చేశారు తాజాగా రెండో ఎపిసోడ్ ప్రసారమైంది.
ఈ ఎపిసోడ్ లో భాగంగా బాలకృష్ణ రామ్ చరణ్ ని ప్రశ్నిస్తూ కెరియర్ లో ఫెయిల్యూర్స్ వస్తే వాటిని ఎలా యాక్సెప్ట్ చేస్తావు అంటూ ప్రశ్న వేశారు.ఈ ప్రశ్నకు రామ్ చరణ్ సమాధానం చెబుతూ… జీవితంలో మనకు ఎదురయ్యే ప్రతి ఒక్క సందర్భం ఒక గుణ పాఠాన్ని నేర్పుతుంది.అందులో తప్పులు ఎక్కడ ఉన్నాయనే విషయాన్ని గుర్తించి ఆ తప్పులను సరి చేసుకుంటూ జీవితంలో ముందుకు వెళ్లాలని తెలిపారు.
ఇలా ఒకసారి జరిగిన తప్పులు మరోసారి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత పూర్తిగా మనపైనే ఉందని చరణ్ తెలియజేశారు.మన జీవితంలో ఎదురయ్యే ప్రతి విషయానికి వెంటనే స్పందించకూడదు.అన్నిటికీ కాలమే సమాధానం చెబుతుంది.పరాజయం ఎదురైనప్పుడు ఈ సంవత్సరం మనదికాదు అనే భావనతో ఉండాలన్నారు.మనకంటూ ఒక సమయం వస్తుంది అప్పటివరకు ఎదురుచూడటం మినహా చేయగలిగేది ఏమీ లేదని తెలిపారు.మన సమయం వచ్చినప్పుడు మనం అంటే ఏంటో నిరూపించుకోవాలని తెలిపారు.
అంతేకానీ జీవితంలో ఎదురైన పరాజయాలను తలుచుకుంటూ అక్కడే ఆగిపోకూడదు పరాజయం తర్వాత కచ్చితంగా విజయాలు కూడా వస్తాయని చరణ్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.