బెస్ట్ అవైలబుల్ స్కూల్ ( రెసిడెన్షియల్ )లో 5వ తరగతిలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

2024 – 25 వ, సంవత్సరమునకు గాను రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District )లోని బెస్ట్ అవైలెటల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ (రెసిడెన్షియల్) 5వ తరగతి లో ప్రవేశము నిమిత్తము షెడ్యూల్డు కులాల విద్యార్థిని విద్యార్థుల నుండి ధరఖాస్తులు కోరబడుచున్నవి.5వ తరగతికి (49) సీట్లు కేటాయించబడినవి.5వ తరగతి (రెసిడెన్షియల్ స్కీం) లో ప్రవేశము పొందిన విద్యార్ధులకు హాస్టల్ వసతి సౌకర్యము కలదు.రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన వారై వుండాలి.వారి తల్లిదండ్రుల వార్షిక ఆదాయము రూ.1,50,000/-, గ్రామస్థాయి లోను మరియు పట్టణ స్థాయి వారికి రూ.2,00,000/- ల లోపు ఉండవలెను.ఈ పాఠశాల శ్రీ సరస్వతి హై స్కూల్E/M, తంగళ్ళపల్లి నందు చేరే 5వ, తరగతి విద్యార్థులు 2023-24 విద్యాసంవత్సరములో 4వ తరగతి పూర్తి చేసినవారై ఉండవలెను.

 Inviting Applications For Admission In Class 5 In Best Available School (residen-TeluguStop.com

విద్యార్థిని, విద్యార్థుల ఎంపిక లాటరీ ద్వారా ఎంపిక చేయబడును.సీట్ల కేటాయింపు ఈ క్రింద తెలిపిన రిజర్వేషన్( Reservation ) ప్రకారము కేటయిఇవబడిను.అగ్రికల్చర్ లేబర్ మరియు మొదటి తరం అక్షరాస్యత కలిగిన : 50% , యస్సీ కుటుంబాల బాల బాలికలకు మాత్రమే , అనాధ పిల్లలకు (తల్లి తండ్రులు లేని వారు అర్హులు : 20% ,(తహశీల్దార్ వారిచే తీసుకున్న సర్టిఫికెట్ జాతపరచవలెను) , జోగిని పిల్లలకు (తహశీల్దార్ వారిచే తీసుకున్న సర్టిఫికెట్ జాతపరచవలెను): 15 % ,బండెడ్ లేబర్ (తహశీల్దార్ వారిచే తీసుకున్న సర్టిఫికెట్ జాతపరచవలెను): 15 %, ఒక కేటగిరిలో విద్యార్థులు లేని మిగిలిన సీట్లను వేరొక కేటగిరి నుండి భర్తీ చేయబడును.బాలికలకు 33% రిజర్వేషన్ వర్తించును.

ధరఖాస్తులు తేది:01-09-2024 నుండి జిల్లా షెడ్యూల్డు కులాల అభివృద్ధి కార్యాలయము 1stFloor F-26 కలెక్టర్, కాంప్లెక్స్, రాజన్న సిరిసిల్ల జిల్లా నందు లభించును.పూర్తి చేసిన దరఖాస్తులను తగు ధ్రువీకరణ పత్రములతో అనగా కులము, ఆదాయము(మీ సేవా ద్వారా పొందినవి) నివాస రేషన్ కార్డు, పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రము (మున్సిపల్ కార్పోరేషన్/ మున్సిపల్ బోర్డ్ /తహశీల్దారు గార్ల ద్వారా పొందినవి) ఆధార్ కార్డు మరియు Bonafide కేర్టిఫికేట్ లతో తేది.16-09-2024 సాయంత్రము 5.00 గంటల లోపు పైన తెలిపిన జిల్లా కార్యాలయములో సమర్పించవలెను.తేది:24-09-2024 రోజున విద్యార్థిని, విద్యార్ధులను లాటరీ ద్వారా గౌరవ జిల్లా కలెక్టర్, రాజన్న సిరిసిల్లా గారి సమక్షములో కలెక్టర్ కాంప్లెక్స్, మీటింగ్ హాల్, రాజన్న సిరిసిల్ల జిల్లా యందు ఎంపిక చేయబడును.ఇతర వివరాలను షెడ్యూల్డు కులాల అభివృద్ధి శాఖ కార్యాలయము, రాజన్న సిరిసిల్ల నందు సంప్రదించగలరు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube