ఈ మధ్య కాలంలో రాఘవ లారెన్స్ కష్టాల్లో ఉన్న ఎంతోమందికి సహయం చేయడం ద్వారా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే.దివ్యాంగులు, అనాథలు, పేదలు, ఆటో డ్రైవర్ల కోసం లారెన్స్ చేస్తున్న సహాయ కార్యక్రమాలపై నెటిజన్ల నుంచి ప్రశంసలు వ్యక్తమయ్యాయి.
అయితే బయటి వాళ్ల కోసం ఎంతో చేసే రాఘవ లారెన్స్(raghava lawrence) తన కుటుంబ సభ్యుల విషయంలో ఎంత ప్రేమగా వ్యవహరిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
తమ్ముడికి రాఘవ లారెన్స్ (raghava lawrence)కారును గిఫ్ట్ గా ఇవ్వడం గమనార్హం.
తమ్ముడికి లారెన్స్ ఇచ్చిన కారు ఖరీదు 20 నుంచి 25 లక్షల రూపాయల మధ్యలో ఉంటుందని తెలుస్తోంది.తమ్ముడిపై ప్రేమతో లారెన్స్ ఒక కారు కోసం ఇంత ఖర్చు చేశారని తెలుస్తోంది.
లారెన్స్ మంచి మనస్సును ఎంత మెచ్చుకున్నా తక్కువే అవుతుందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
నటుడిగా, దర్శకుడిగా కెరీర్ ను కొనసాగిస్తున్న లారెన్స్ సినిమా సినిమాకు కెరీర్ పరంగా ఎదుగుతున్నారు.హర్రర్ కాన్సెప్ట్ ఉన్న సినిమాలను ఆయన ఎక్కువగా ఎంచుకుంటూ ఉండటం గమనార్హం.కాంచన సిరీస్ (Kanchana series) లారెన్స్ కు కెరీర్ పరంగా ఎంతో ప్లస్ అయింది.
ఎం.జీ హెక్టార్ (MG hectare)కారును లారెన్స్ తన తమ్ముడికి బహుమతిగా ఇచ్చారు.
లారెన్స్ తమ్ముడు ఎల్విన్ కూడా సినిమాలపై దృష్టి పెడుతున్నారని తెలుస్తోంది.
బుల్లెట్ అనే సినిమాతో ఎల్విన్ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారని సమాచారం.ఎల్విన్ కూడా సినిమాల్లో సక్సెస్ సాధించాలని అభిమానులు ఫీలవుతున్నారు.స్క్రిప్ట్స్ విషయంలో లారెన్స్ కు అద్భుతంగా పట్టు ఉన్న నేపథ్యంలో ఎల్విన్ కెరీర్ పరంగా సులువుగానే సక్సెస్ సాధించే ఛాన్స్ అయితే ఉందని చెప్పవచ్చు.
లారెన్స్ పారితోషికం కూడా ఒకింత భారీ స్థాయిలో ఉంది.తెలుగుతో పోల్చి చూస్తే తమిళంలో లారెన్స్ ఎక్కువగా సక్సెస్ లను సొంతం చేసుకుంటున్నారు.