తెలుగు సినిమా ఇండస్ట్రీ యాంగ్రీ యంగ్ మ్యాన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న రాజశేఖర్( Rajasekhar )… కెరియర్ మొదట్లో చాలా సినిమాలతో మంచి పేరు అయితే సంపాదించుకున్నాడు.అయితే ఆయనకున్న పేరు కంటే కూడా ఆయనకు ఇంకా మంచి పేరు అయితే వచ్చేది.
కానీ ఆయన కొన్ని సినిమాలను రిజెక్ట్ చేసి చాలా పెద్ద తప్పు చేశాడానే చెప్పాలి.ముఖ్యంగా శంకర్( Shankar ) డైరెక్షన్ లో అర్జున్ హీరోగా వచ్చిన జెంటిల్ మెన్ సినిమాలో మొదట రాజశేఖర్ హీరోగా చేయాలని అనుకున్నాడు.
కానీ కొన్ని అనివార్య కారణాలు ఆ సినిమా నుంచి రాజశేఖర్ తప్పుకున్నాడు.
ఇక ఇదిలా ఉంటే తెలుగులో సూపర్ హిట్లుగా నిలిచిన రెండు సినిమాల్లో రాజశేఖర్ హీరోగా సెలెక్ట్ అయి మళ్ళీ మిస్ చేసుకున్న సినిమాలు ఏంటంటే హీరోగా జయంత్ సి పరంజి దర్శకత్వంలో వచ్చిన లక్ష్మీనరసింహ సినిమాను( Lakshminarasimha movie ) కూడా మొదట రాజశేఖర్ హీరోగా చేయాలని అనుకున్నాడట కానీ కుదర్లేదు.ఆ సినిమా రీమేక్ రైట్స్ తీసుకొని రాజశేఖర్ చేద్దామని అనుకున్నాడట కానీ ముందు బెల్లంకొండ సురేష్ ఈ సినిమా రీమేక్ రైట్స్ ను తీసుకోవడం వల్ల రాజశేఖర్ ఆ సినిమా చేయలేకపోయాడు.దాంతో రాజశేఖర్ చాలా డిజప్పాయింట్ అయినట్టుగా కూడా అప్పట్లో వార్తలు అయితే వచ్చాయి.
ఆ సినిమా రాజశేఖర్ చేసిన కూడా చాలా అద్భుతంగా ఉండేదని చాలామంది అభిమానులు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేశారు.
ఇక ఇదిలా ఉంటే పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో నాగార్జున హీరోగా వచ్చిన శివమణి సినిమాను( Shivamani movie ) కూడా మొదట పూరి రాజశేఖర్ తో చేయాలనుకున్నాడు కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ ప్రాజెక్టు నుంచి కూడా రాజశేఖర్ తప్పుకోవలసి వచ్చింది.ఇక మొత్తానికైతే రెండు సూపర్ హిట్ సినిమాలను మిస్ చేసుకొని ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు పొందే అవకాశాన్ని తనకు తానే చేజర్చుకున్నాడనే చెప్పాలి…
.