Noodles Viral Video : వీడియో వైరల్: ఇదేందయ్యా ఇది.. ఈ నూడుల్స్ మనుషులు తినడానికా., లేక జంతువులు తినడానికా..?!

ఇంట్లో జరిగే ఎటువంటి కార్యమైనా సరే.వచ్చిన అతిథులకు సంతృప్తిగా భోజనం పెట్టడం భారతీయుల సంప్రదాయం.

 Viral Video Of Noodles Preparing In Unhygienic Condition-TeluguStop.com

కార్యక్రమం నిర్వహించేవారు వారి స్తోమత తగ్గట్టు వచ్చిన అతిథులకు రకరకాల వంటకాలతో భోజనాలు చేయడము లేక ఆర్డర్ ఇచ్చి తెప్పించడం లాంటి విషయాలు మనం చూస్తూనే ఉంటాం.అయితే ఇలా తెచ్చిన ఆహారం కేవలం రుచి మాత్రమే కాకుండా పరిశుభ్రత కూడా పాటించే విధంగా ఉండాలి.

ఇది ఇలా ఉండగా తాజాగా సోషల్ మీడియాలో ఒక కార్యక్రమంలో తయారవుతున్న నూడిల్స్( Noodles ) సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.వీడియోలో ఓ వ్యక్తి న్యూడిల్స్ ని తయారు చేసిన విధానాన్ని చూసి నెటిజన్స్ పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ వీడియోని ఓసారి చూస్తే.ఏదో కార్యక్రమంలో భాగంగా భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు.వంటలలో భాగంగా వచ్చిన అతిథులకు( Guests ) నూడిల్స్ ని పెట్టాలని భావించుకున్నారు.అయితే ఈ నూడిల్స్ ను అతిథులకు తయారు చేసే విధానం ఇప్పుడు అందరికి ఆగ్రహం తెప్పించే విధంగా ఉంది.

నూడిల్స్ ను తయారు చేసే సమయంలో ఓ వ్యక్తి వాటిని కలిపేందుకు ఎలాంటి గరిటలు ఉపయోగించకుండా తన రెండు చేతులతో అచ్చం పాడి పశువులకు కుడిపి నీళ్లు ఎలా కలుపుతారో అలా నూడుల్స్ ను కిందికి పైకి ఇష్టం వచ్చిన విధంగా కలిపేస్తున్నాడు.

ఓవైపు తనకి చెమట కారుతున్న అదే చేత్తో తుడుచుకుంటూ మళ్ళీ నూడిల్స్ ను కలపడంతో అక్కడ ఉన్న వారు ఆయనపై సీరియస్ అయ్యారు.ఈ సమయంలో తీసిన వీడియో సోషల్ మీడియాలో( Social Media ) పోస్ట్ చేయగా ఆ వీడియో కాస్త తెగ వైరల్ గా మారింది.ఫ్రీగా నూడిల్స్ వస్తున్నాయని చెప్పి ఇలాంటి వాటిని తింటే మన పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించండి.

కాబట్టి ఎక్కడైనా భోజనాలు చేసే సమయంలో సుచి శుభ్రత వంటి పాటిస్తున్న వారిని చూసి అక్కడ భోజనాలు చేయడం మంచిది.ఇంకెందుకు ఆలస్యం ఈ వైరల్ వీడియోని( Viral Video ) మీరు కూడా చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube