ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మరోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా అధికార పార్టీ వైసీపీ( YCP ) అడుగులు వేస్తోంది.ఇందులో భాగంగానే ‘సిద్ధం’ ( Siddham )పేరిట భారీ బహిరంగ సభలను నిర్వహిస్తుంది.
ఇప్పటికే భీమిలి, దెందులూరు, రాప్తాడులో మూడు సభలను పూర్తి చేసిన వైసీపీ నాలుగో సభకు సిద్ధమైంది.ఈ మేరకు మార్చి 2వ తేదీన పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేట నియోజకవర్గం బొప్పూడిలో ‘సిద్ధం’ సభను నిర్వహించనున్నారు.
ఈ సభకు నెల్లూరు, ప్రకాశం, గుంటూరు మరియు కృష్ణా జిల్లాల నుంచి పార్టీ నేతలు, కార్యకర్తలు( Party leaders, workers ) హాజరుకానున్నారు.కాగా ఈ నాలుగో సిద్ధం సభా వేదికగా వైసీపీ మ్యానిఫెస్టోను( YCP Manifesto ) ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.నవరత్నాలకు అదనంగా పలు కీలక అంశాలను వైసీపీ తమ మ్యానిఫెస్టోలో పొందుపరుస్తుందని సమాచారం.ఈ క్రమంలోనే రైతు రుణమాఫీ, మహిళలకు సంబంధించిన కీలక అంశాలతో ఎన్నికల మ్యానిఫెస్టో ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.