మేడారం జాతర( Medaram Jatara ) మొదలు కావడంతో ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా తరలివస్తున్నారు.దూరప్రాంతాల నుంచి వచ్చే భక్తులు మేడారంలో వన దేవతలను దర్శించుకోవడంతో పాటు అనేక ఆధ్యాత్మిక, టూరిస్ట్ ప్రదేశాలను తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు.
హైదరాబాద్ వైపు నుంచి వచ్చే వాళ్లకు వరంగల్ కోట, భద్రకాళి ఆలయం( Warangal Fort, Bhadrakali Temple ), 1000 స్తంభాలా దేవాలయాన్ని చూసే అవకాశం ఉంది.ముఖ్యంగా చెప్పాలంటే వరంగల్ కోట కాకతీయుల కళా నైపుణ్యానికి ప్రతికగా నిలుస్తూ ఉంది.
ఈ కోట నిర్మాణాన్ని 13వ శతాబ్దంలో కాకతీయ వంశానికి చెందిన గణపతి దేవుడు మొదలుపెట్టగా, ఆయన కుమార్తె రుద్రమదేవి పూర్తి చేశారు.వరంగల్ కోట ప్రతి ఒక్కరు చూడాల్సిన చరిత్రకా స్థలం.
దీనినే ఖిలా వరంగల్ అని కూడా అంటారు.
వరంగల్ రైల్వే స్టేషన్, బస్టాండ్ నుంచి సుమారు మూడు కిలో మీటర్ల దూరంలో ఇది ఉంది.హనుమకొండ బస్టాండ్ నుంచి 8.7 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది.అలాగే వరంగల్ రైల్వే స్టేషన్, బస్టాండ్ నుంచి 4.5 కిలోమీటర్ల దూరంలో భద్రకాళి దేవాలయం ఉంది.ఈ దేవాలయానికి దక్షిణ భాగాన ఒక గుహ ఉంటుంది.అందులో మునులు తపస్సు చేసే వారిని స్థానిక భక్తులు చెబుతున్నారు.ఆలయానికి ఎదురుగా పెద్ద చెరువు ఉండగా, కట్టను భద్రకాళి బండ్ గా అభివృద్ధి చేశారు.దీంతో ఈ ప్రాంతమంతా టూరిస్ట్ లతో కలకలలాడుతూ ఉంటుంది.
ముఖ్యంగా చెప్పాలంటే హనుమకొండ ( Hanumakonda )నుంచి ములుగు వెళ్లే మెయిన్ రోడ్ పై 1000 స్తంభాలా దేవాలయం ఉంది.అలాగే హనుమకొండ బస్టాండ్ నుంచి 2.4 కిలో మీటర్ల దూరంలో, వరంగల్ రైల్వే స్టేషన్, బస్టాండ్ నుంచి 5.6 కిలోమీటర్ల దూరంలో ఈ దేవాలయం ఉంటుంది.కాకతీయుల కళా నైపుణ్యానికి ఈ దేవాలయం ప్రతికగా నిలుస్తుంది.అలాగే దేవాలయంలో శివలింగం ఉంటుంది.ఈ దేవాలయానికి ఈశాన్యంలో కోనేరు, ఎదురుగా నల్లరాతి శిలతో చేసిన నందీశ్వరుడు, కల్యాణమండపలు ఉంటాయి.ముఖ్యంగా చెప్పాలంటే కాకతీయులు ఈ ఆలయం నుంచి ఓరుగల్లు కోటకు రహస్య మార్గం నిర్మించినట్లు చరిత్ర లో ఉంది.
DEVOTIONAL