Astrology : నిద్రలేవగానే చూడవలసినవి, చూడకూడనివి ఇవే..!

ఎవరికైనా అనుకోని ఆపద ఎదురైనప్పుడు ఈ రోజు లేవగానే ఎవరి ముఖం చూసామో అని అనుకుంటూ ఉంటారు.అలాగే ఏదైనా అనుకోని విధంగా కలిసి వచ్చినప్పుడు కూడా అబ్బ ఈ రోజు లేచినప్పుడు ఎవరి ముఖం చూసామో అని కూడా అనుకుంటూ ఉంటాము.

 What To See And What Not To See After Wakeup-TeluguStop.com

అయితే నిద్ర లేవగానే( Wakeup ) ముందుగా ఏం చేయాలి? లేచిన సమయమే ఆరోజు ఏ విధంగా ఉండాలో నిర్ణయిస్తుంది.దీని గురించి మన శాస్త్రాల్లో ఏమని చెప్పబడిందో ఇప్పుడు తెలుసుకుందాం.

చాలామంది ఉదయం లేవగానే అరచేతులు చూసుకొని నిద్ర లేస్తారు.ఇలా రెండు అరచేతులను చూసుకోవడం వెనుక ఒక పరమార్ధం కూడా దాగి ఉంది.

అరచేతులు( Palms ) చూసుకోవడం మంచిది.

Telugu Astrology, Flowers, Lucky Day, Palms, Wakeup-Latest News - Telugu

ఎందుకంటే లక్ష్మి అరచేతులలో, లక్ష్మీమధ్య భావన సరస్వతి( Saraswathi ) చివరి భాగాన గౌరీదేవి ఉన్నట్లుగా భావిస్తారు.కాబట్టి వారిని స్మరించుకుంటే ఆ రోజంతా శుభం జరుగుతుంది.కాబట్టి నిద్ర లేవగానే ఎప్పుడైతే మన అరచేతుల్ని మనం చూసుకుంటామో కంటి ద్వారా బయటకు వచ్చిన విద్యుత్ మన అరచేతుల మీద నుండి ప్రసరించి తిరిగి మళ్ళీ మన శరీరంలోకి వచ్చి న్యూట్రల్ అవుతుంది.

దీని వలన శరీరం బ్యాలెన్స్ గా ఉండి ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ఉంటుంది.నిద్ర లేవగానే ఎవరిని చూడాలో? ఎవరిని చూడకూడదో? మన శాస్త్రాల్లో కూడా చెప్పడం జరిగింది.ఆవాలు, నెయ్యి, పెరుగు, తేనె, పువ్వులు( Flowers ) ప్రకృతి తెల్లటి పక్షి కొబ్బరికాయ అద్దం హోమగుండం.

Telugu Astrology, Flowers, Lucky Day, Palms, Wakeup-Latest News - Telugu

ఇలాంటివన్నీ నిద్ర లేవగానే చూడడం వలన రోజు చాలా మంచిగా గడుస్తుంది.వీటన్నిటిని చూడడం వలన చాలా మంచి జరుగుతుంది.అలాగే నిద్ర లేవగానే ఎదుటి వ్యక్తి పాదాలు( Foot ) చూస్తే దరిద్రమట.

అదే విధంగా నిద్రలేచినప్పుడు ముందుగా చెప్పులు, చెత్తబుట్ట, పగిలిన అద్దం, గొడవ పడుతున్న వ్యక్తులు, జుట్టు విరవేసుకున్న స్త్రీ, కడగకుండా వదిలేసిన ఎంగిలి పాత్రలు, గుడ్డివారు, సొట్ట వారు, మొండి గోడలను చూస్తే మంచిది కాదట.మంచం మీద నుండి కిందకు దిగుతున్నప్పుడు ముందుగా భూమాతకు నమస్కరించుకోవాలి.

అలాగే బ్రహ్మ ముహూర్తంలో అంటే తెల్లవారుజామున 3:30 నిమిషాల నుండి 5 గంటల సమయం మధ్యలో నిద్రలేస్తే చాలా మంచిది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube