Lungs : ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే.. వీటిని మిస్స్ కాకుండా చేయండి..!

శరీరంలో ముఖ్యమైన భాగాల్లో ఊపిరితిత్తులు( Lungs ) కూడా ఒకటి.ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటేనే ఎక్కువ రోజులు బ్రతక గలుగుతాము.

 Tips To Keep Your Lungs Healthy-TeluguStop.com

ఈ బిజీ బిజీ లైఫ్ లో జీవనశైలిలో మార్పులు, ఆహారపు అలవాట్ల కారణంగా ఊపిరితిత్తులు అనేవి పాడైపోతున్నాయి.అలాగే ఇతర అనేక రకాల వ్యాధులు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

అందుకే ఆరోగ్యంగా ఉండడం చాలా ముఖ్యం.ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని రకాల పద్ధతులు కచ్చితంగా పాటించాలి.

మంచి ఆహారం తీసుకోవడంతో పాటు కొన్ని రకాల బ్రీతింగ్ పద్ధతులు కూడా తరచూ చేస్తూ ఉండాలి.దీని వలన ఊపిరితిత్తులని ఆరోగ్యంగా మార్చుకోవచ్చు.

మరి అవెంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu Tips, Deep, Lungs-Telugu Health

డీప్ బ్రీతింగ్( Deep Breathing ) అనేది శక్తివంతమైన, అద్భుతమైన వ్యాయామ పద్ధతి అని చెప్పవచ్చు.ఈ బ్రీతింగ్ చేయాలంటే నిటారుగా కూర్చోవాలి.భుజాలను వదులుగా ఉంచుకోవాలి.

ఇక నెమ్మదిగా ఊపిరి తీసుకుంటూ పొట్టపైకి వచ్చేలా శ్వాస తీసుకోవాలి.ఆ తర్వాత నెమ్మదిగా వదులుతూ ఉండాలి.

ఇలా రోజుకు కనీసం 10 సార్లు అయినా చేస్తే ఊపిరితిత్తులు బలంగా తయారవుతాయి.అలాగే నాసిక రంద్రాలతో శ్వాస పీల్చుకొని నెమ్మదిగా వదులుతూ ఉండాలి.

అలాగే ఎడమవైపు నాసికను మూసి కుడివైపు నాసిక రంద్రంతో శ్వాస పీల్చుకోవాలి.ఇలా రోజుకు ఐదు నుండి పది సార్లు చేయాలి.

Telugu Tips, Deep, Lungs-Telugu Health

పంపింగ్ బ్రీతింగ్( Pumping Breathing ) పద్ధతిలో ముక్కుతో డీప్ బ్రీత్ తీసుకోవాలి.నోటి నిండా గాలితో నింపాలి.ఆ తర్వాత కూర్చుని నెమ్మ నెమ్మదిగా గాలి వదులుతూ ఉండాలి.ఇలా రోజుకు ఐదుసార్లు చేయాలి.ఇలా చేయడం వలన ఊపిరితిత్తుల ఆరోగ్యంగా ఉంటాయి.ఇక ముఖం కూడా కాంతివంతంగా తయారవుతుంది.

మెట్లు ఎక్కే పద్ధతి కూడా బాగా ఉపయోగపడుతుంది.మెట్లు ఎక్కేటప్పుడు లోతుగా శ్వాస తీసుకోవాలి.

ఆ తర్వాత దిగేటప్పుడు శ్వాసను నెమ్మదిగా వదులుతూ ఉండాలి.ఇలా రోజు చేయాలి.

ఇలాంటి పద్ధతులు పాటించడం వలన ఊపిరి తిత్తులు బలంగా ఉంటాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube