చాలామంది మనుషులు వారి రాశులకు అనుగుణంగా రత్నాల గుర్రాలను ధరించడం తరచుగా చూస్తూ ఉంటారు.ఈ రత్నాలలో ఒకటి నీలమణి.
( Nilamani ) నీలం శని దేవుని రత్నంగా పరిగణిస్తారు.జ్యోతిష్య శాస్త్రంలో అన్ని గ్రహాలు ఏదో ఒక రత్నాన్ని కలిగి ఉంటుంది.
ఈ రత్నాలని ధరించిన వారి జీవితంలోని అన్ని సమస్యలు కూడా తొలగిపోతాయని నమ్ముతారు.అయితే నీలం రత్నాన్ని( Blue Sapphire ) ఏ రాశి వారు ధరిస్తే శుభ పరిణామాలు కలుగుతాయో, నీల రత్నాన్ని ఎలాంటి పద్ధతుల్లో ధరించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
రత్న శాస్త్రంలో ప్రధానంగా తొమ్మిది రత్నాల గురించి ప్రస్తావించారని పండితులు చెబుతున్నారు.ఇందులో నీలమణి రత్నం శని దేవుడికి సంబంధించినది.
జాతకంలో శని( Shani ) బలహీనంగా ఉంటే, లేదా శుభ స్థానంలో ఉంటే ఆ వ్యక్తులు నీలం ధరించాలని చెబుతున్నారు.ఇక నీలమణి తక్షణ ప్రభావాన్ని చూపే రత్నంగా కూడా పరిగణిస్తారు.ఇక ఈ రత్నాన్ని రాశి చక్రం ప్రకారం మాత్రమే ధరిస్తారు.లేదా చెడు ఫలితాలు వస్తాయని పండితులు చెబుతున్నారు.రత్న శాస్త్రం ప్రకారం నీలమణి రత్నం ముఖ్యంగా మకరం,( Capricorn ) కుంభరాశి ( Aquarius ) వారికి మంచిదని పండితులు చెబుతున్నారు.ఇక ఈ రాశుల వారిని శని దేవుడే పాలిస్తాడు.
అంతేకాకుండా వృషభం, మిథునం, కన్యా, తుల రాశుల వారు కూడా నీలం రత్నాన్ని ధరించాల్సిందే.
శని దేవుడు జాతకంలో బలహీనంగా ఉంటే నీలం రత్నాన్ని ధరించడం వలన అతని శక్తులు పెరుగుతాయి.పగడం, రూబీ, ముత్యాలను నీలమణితో ధరించకూడదు.ఇలా ధరిస్తే కష్టాలు ఎదురవుతాయని పండితులు చెబుతున్నారు.
నీలం రత్నం ప్రభావం చాలా త్వరగా ఉంటుంది.ఈ రత్నాలు మీకు సరిపోకపోతే మీరు చాలా సమస్యలను ఎదుర్కొంటారు.
ఈ నెల రత్నం ధరిస్తే ఆరోగ్య సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వ్యక్తి ఉపశమనం పొందుతాడట.నీల రత్నం శుభప్రదంగా ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఆర్థిక ప్రయోజనాలను పొందడం ప్రారంభిస్తాడు.
అంతేకాకుండా ఉద్యోగంతో పాటు వ్యాపారంలో కూడా పురోగతిని కూడా సాధిస్తారు.
LATEST NEWS - TELUGU