Eyesight : ఈ ఒక్కటి తింటే చాలు కంటిచూపు పెరగడం ఖాయం..!

ఈ మధ్యకాలంలో చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు చాలామంది కంటిచూపు సమస్యలతో బాధపడుతున్నారు.అయితే కంటిచూపు( Eyesight ) సమస్య రావడానికి ఎన్నో రకాల కారణాలు ఉన్నాయి.

 If You Eat This One Your Eyesight Will Surely Increase-TeluguStop.com

వాటిలో మనం ఉపయోగించే ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ( Electronic gadgets )ప్రధాన కారణమని చెప్పుకోవచ్చు.ఇక రెండవది ఆహార పదార్థాలు.

సరైన పోషకాలు కలిగిన ఆహారం తీసుకోకపోవడం వలన కంటిచూపు సమస్యలు మొదలవుతాయి.అయితే కళ్ళు అనేవి ఎంతో ప్రధానమైనవి.

కాబట్టి వాటిని మనం జాగ్రత్తగా చూసుకోవాలి.కంటి సమస్యలు వస్తే ఒక జీవితం అంతా చీకటి మయమైపోతుంది.

Telugu Almonds, Eat, Jaggery, Pepper-Telugu Health

అయితే కంటిచూపు సమస్య వచ్చిన తర్వాత జాగ్రత్త పడడం కంటే రాకముందే కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.దీంతో ఆ సమస్యకు చెక్ పెట్టవచ్చు.కంటిచూపు మెరుగవ్వడం కోసం కొన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకోవాలి.కొన్ని బాదం పప్పులను ( Almonds ) శుభ్రంగా కడిగి రాత్రంతా నానబెట్టాలి.అలా నానబెట్టిన బాదం గింజల పొట్టు తీసి చిన్న రోల్లో వేసి మెత్తగా ముద్దలాగ చేయాలి.ఈ బాదం కంటికి చాలా బాగా ఉపయోగపడుతుంది.

ఎందుకంటే ఇందులో విటమిన్స్, మినరల్స్, మాంసకృత్తులు సమృద్ధిగా లభిస్తాయి.ఇవి కంటిని బాగా ప్రొటెక్ట్ చేస్తాయి.

అంతేకాకుండా మంచి జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది.

Telugu Almonds, Eat, Jaggery, Pepper-Telugu Health

అలాగే అనేక రకాల రోగాల బారి నుండి కూడా కాపాడుతుంది.ఇక రెండో పదార్థం మిరియాలు.ఒక ఐదు మిరియాలు( Pepper ) తీసుకొని ఇవి కూడా వేసి బాగా దంచి మెత్తగా ముద్దలాగ చేయాలి.

అలాగే పట్టిక బెల్లం( jaggery ) కూడా తీసుకోవాలి.ఒక స్పూన్ వరకు తీసుకొని ఓ చిన్న రోట్లో వేసి బాగా మెత్తగా దంచాలి.ఇది కంటిచూపు మెరుగుపరచడంలో నూరు శాతం వరకు హెల్ప్ చేస్తుంది.పాలలో కూడా ఎన్నో పోషకాలు లభిస్తాయి.

ఇప్పుడు ఈ పాలలో మనం తయారు చేసి పెట్టుకున్న బాదం, పట్టిక బెల్లం అలాగే మిరియాల పేస్టుని ఈ గోరువెచ్చని పాలలో వేసి బాగా కలపాలి.ఇక ఈ పాలను తరచూ ప్రతిరోజు ఉదయం పూట తీసుకోవాలి.

ఇలా తాగడం వలన అనేక రకాల కంటి సమస్యల నుండి కాపాడుకోవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube