వయసుతో సంబంధం లేకుండా కోట్లాది మంది అధిక బరువు( Over Weight ) సమస్యతో బాధపడుతున్నారు.హైట్ కి తగ్గ వెయిట్ మెయింటైన్ చేయకపోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తుంటాయి.
అందుకే పెరిగిన బరువును తగ్గించుకోవడం కోసం చాలా మంది ప్రయత్నిస్తుంటారు.అయితే వెయిట్ లాస్ కు మన వంటింట్లో ఉండే కొన్ని పదార్థాలు ఎంతో అద్భుతంగా సహాయపడతాయి.
అటువంటి వాటిల్లో పసుపు( Turmeric ) కూడా ఒకటి.పసుపును రోజూవారీ వంటల్లో వాడుతూనే ఉంటాము.
కానీ, అలా కాకుండా పసుపును ఇప్పుడు చెప్పబోయే విధంగా తీసుకుంటే ఎంత లావుగా ఉన్న వారైనా సరే దెబ్బకు సన్నబడతారు.
అందుకోసం ముందుగా ఒక గ్లాసు గోరు వెచ్చని నీటిని( Warm Water ) తీసుకోవాలి.
ఈ వాటర్ లో పావు టేబుల్ స్పూన్ ఆర్గానిక్ పసుపు వేసుకోవాలి.అలాగే వన్ టేబుల్ స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్,( Apple Cider Vinegar ) వన్ టేబుల్ స్పూన్ తేనె మరియు చిటికెడు నల్ల మిరియాల పొడి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.
తద్వారా మన డ్రింక్ సిద్ధం అవుతుంది.
బరువు తగ్గాలనుకునేవారు ప్రతిరోజు ఉదయం ఈ పవర్ ఫుల్ ఫ్యాట్ కట్టర్ డ్రింక్ ను( Fat Cutter Drink ) తీసుకోవాలి.పసుపు మాత్రమే కాదు ఆపిల్ సైడర్ వెనిగర్, మిరియాల పొడి, తేనె ఇవన్నీ బరువు తగ్గడానికి తోడ్పడతాయి.మెటబాలిజం రేటును( Metabolism Rate ) పెంచుతాయి.
శరీరంలో అదనపు కేలరీలను వేగంగా కరిగిస్తాయి.పొట్ట కొవ్వులు సైతం మాయం చేస్తాయి.
ఈ డ్రింక్ తో ఎంత లావుగా ఉన్న వారైనా సరే క్రమ క్రమంగా సన్నబడతారు.నాజూగ్గా తయారవుతారు.కాబట్టి అధిక బరువు సమస్యతో బాధపడుతున్న వారు తప్పకుండా పసుపును ఇప్పుడు చెప్పిన విధంగా తీసుకునేందుకు ప్రయత్నించండి.పైగా ఈ డ్రింక్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకుంటే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది.
ఇన్ఫెక్షన్లతో పోరాడే సామర్థ్యం లభిస్తుంది.జలుబు, దగ్గు వంటి సీజనల్ వ్యాధులకు సైతం దూరంగా ఉండవచ్చు.