సాధారణంగా దీపారాధన విషయంలో ఎన్నో రకాల జాగ్రత్తలు వహించాలి.అలాగే అనేక రకాల నియమాలు కూడా పాటించాలని పండితులు చెబుతూ ఉంటారు.
లేదంటే పూజ చేసిన ఫలితం కూడా దక్కదని చెబుతూ ఉంటారు.అయితే మామూలుగా ఇంట్లో చేసే నిత్య పూజకు ఎప్పుడు కూడా మట్టి ప్రమిదలు వాడకూడదు.
అలాగే పంచ లోహాలతో చేసిన దీపాలు వెండి లేదా ఇత్తడి దీపాలు వాడాలి.ఇక తెల్లవారి జామున 3 నుండి 6 గంటల లోపు దీపారాధన చేయడం శుభకరంగా భావిస్తారు.
ఇక సూర్యస్తమయం తర్వాత లక్ష్మీ ఆరాధన చేసి దీపం వెలిగిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి.అలాగే తూర్పు ముఖంగా వెలిగించే దీపం వలన గ్రహ దోషాలు( Graha Dosha ) తొలగిపోతాయి.
అయితే పడమర వైపు దీపం వెలిగిస్తే రుణ బాధలు, శని గ్రహదోష నివారణ జరుగుతుంది.
అలాగే ఉత్తర దిశగా వెలిగించే దీపం సిరిసంపదలు, విద్యావివాహ ప్రాప్తికి దోహదం చేస్తాయి.ఇక దక్షిణ దిశలో దీపారాధన అస్సలు చేయకూడదు.దక్షిణ ముఖంగా దీపం వెలిగిస్తే అపశకునాలు, అలాగే కష్టాలు, దుఃఖాలు, బాధ ఎక్కువైపోతాయి.
అంతేకాకుండా ఎప్పుడు కూడా వేరుశనగ నూనెతో దీపారాధన చేయకూడదు.నువ్వుల నూనె వాడితే చాలా మంచిది.
ఆముదంతో దీపారాధన చేస్తే దాంపత్యం సజావుగా ఉంటుంది.ఇక వేప, కొబ్బరి నూనెలు కలిపి 41 రోజులు దీపారాధన చేస్తే సకల సంపదలు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి.
ఇక నేతి దీపం వెలిగిస్తే అత్యంత మంగళకరం.నేతి దీపం ప్రతిరోజు సంధ్యా సమయంలో వెలిగించడం వలన మంచి జరుగుతుంది.
అలాగే చాలా ప్రయోజనాలు కలుగుతాయి.ఇది దేవతలకు ఇష్టమైన దీపారాధన.ఇది ఇంటి వాతావరణంలో ఉన్న నెగిటివిటీని తొలగిస్తుంది.అలాగే సాయంత్రం సమయంలో నేతి దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి ( Lakshmi Devi )ఇంట్లోకి వస్తుందని నమ్మకం.
నేతి దీపంతో వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయి.ఇక నెయ్యి, నూనె రెండిటితో దీపారాధన చేయడం వలన కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయి.
మల్లె నూనెతో హనుమంతునికి అలాగే శని దేవుడికి ఆవాల నూనెతో దీపం వెలిగించడం చాలా శుభప్రదం.ఇక నెయ్యి దీపం ఎప్పుడు ఎడమవైపు ఉండేలా చూసుకోవాలి.
అలాగే నూనె దీపం కుడివైపు ఉండాలి.
DEVOTIONAL