కెనడా : జైళ్ల శాఖలో కీలక పదవి.. చరిత్ర సృష్టించిన భారతీయ సిక్కు యువకుడు

ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో స్థిరపడిన పంజాబీ వాసులు కీలక స్థానాలకు చేరుకుంటున్నారు.ముక్త్‌సర్ పోలీస్‌ విభాగానికి చెందిన రిటైర్డ్ అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ఏఎస్ఐ) కొడుకు జషన్‌ప్రీత్ సింగ్ బ్రార్( Jashanpreet Singh Brar ) కెనడాలోని వాంకోవర్‌లో కరెక్షనల్ ఆఫీసర్‌గా( Correctional Officer ) నియమితులయ్యారు.

 24-yr-old Punjab Man Jashanpreet Singh Canada Jail Officer Details, Punjab ,jas-TeluguStop.com

అసైన్‌మెంట్‌లు, భోజనం, వినోద కాలక్షేపాల్లో ఖైదీలను పర్యవేక్షించడం ఆయన విధులు.జషన్‌ప్రీత్ సింగ్ బ్రార్ ఆగస్ట్ 2017లో స్టడీ వీసాపై అక్కడికి వెళ్లాడు.

ఇతను ముక్త్‌సర్‌‌లోని( Muktsar ) భాయ్ మస్తాన్ సింగ్ పబ్లిక్ స్కూల్ పూర్వ విద్యార్ధి.కెనడాలో తన చదువును పూర్తి చేసిన తర్వాత .జషన్‌ప్రీత్ సెక్యూరిటీ ఆఫీసర్‌గానూ, మద్యం దుకాణంలో ఎగ్జిక్యూటివ్‌గా పార్ట్‌టైమ్‌ ఉద్యోగం చేశారు.

Telugu Canada, Canada Jail, Canada Nri, Correctional, Kaur Singh Brar, Manmeet K

జషన్‌ప్రీత్ తండ్రి కౌర్ సింగ్ బ్రార్( Kaur Singh Brar ) మాట్లాడుతూ.తన కుమారుడు తన అడుగుజాడల్లో నడుస్తున్నందుకు గర్వపడుతున్నానని అన్నారు.తాను 1992లో రాష్ట్ర పోలీస్ కానిస్టేబుల్‌గా చేరి ఏఎస్ఐగా పదవీ విరమణ( Retired ASI ) చేశానని , కానీ ఇవాళ తన కుమారుడు కరెక్షనల్ ఆఫీసర్ డ్యూటీలో చేరాడని బ్రార్ హర్షం వ్యక్తం చేశారు.

తన కుమార్తె సైతం కెనడాలో స్థిరపడి ప్రైవేట్ డెంటిస్ట్‌గా పనిచేస్తోందని చెప్పారు.పిల్లలిద్దరూ చదువులో చురుగ్గా వుండేవారని బ్రార్ తెలిపారు.మాది కోట్లి సంఘర్ గ్రామానికి చెందిన వ్యవసాయ కుటుంబమని, మా ఫ్యామిలీలో ఇంతకుముందు ఎవరూ విదేశాల్లో ప్రభుత్వ ఉద్యోగంలో పనిచేయలేదన్నారు.

Telugu Canada, Canada Jail, Canada Nri, Correctional, Kaur Singh Brar, Manmeet K

ఇకపోతే.గతేడాది ఏప్రిల్‌లోనూ భారత సంతతికి చెందిన సిక్కు మహిళ మన్మీత్ కౌర్( Manmeet Kaur ) చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే.అక్కడి పోలీస్ శాఖలో అసిస్టెంట్ పోలీస్ చీఫ్‌గా బాధ్యతలు అందుకున్న తొలి సిక్కు మహిళగా ఆమె రికార్డుల్లోకెక్కారు.

మన్మీత్ జలంధర్‌లోని గురురాందాస్ పబ్లిక్ స్కూల్‌లో ఆరవ తరగతి వరకు చదువుకున్నారు.ఆ తర్వాత 1996లో ఆమె తన కుటుంబంతో కలిసి అమెరికాకు వెళ్లింది.అక్కడ 12వ తరగతి పూర్తి చేసిన అనంతరం యూనివర్సిటీ ఆఫ్ న్యూ హెవెన్ నుంచి కమర్షియల్ లా చీఫ్, మాస్టర్ ఆఫ్ లాస్ డిగ్రీని పొందారు.2008లో పోలీస్ శాఖలో చేరిన మన్మీత్ ఎట్టకేలకు తన జీవితాశయాన్ని నెరవేర్చుకున్నారు.అనతికాలంలోనే సమర్ధురాలైన అధికారిగా పేరు తెచ్చుకున్న మన్మీత్.ఇప్పుడు అసిస్టెంట్ పోలీస్ చీఫ్ స్థాయికి చేరుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube