మరొక రోజు గడిస్తే 2023 సంవత్సరానికి గుడ్ బై చెబుతూ 2024వ సంవత్సరానికి గ్రాండ్ వెల్కమ్ చెప్పబోతున్నారు.ఇలా కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నటువంటి తరుణంలో ఎంతోమంది యువతి యువకులు కొత్త సంవత్సరంలో మేము ఇది సాధించాలి అంటూ లక్ష్యం పెట్టుకొని కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సంగతి మనకు తెలిసిందే.
ఇక ఈ ఏడాది జరిగినటువంటి కొన్ని సంతోషకరమైనటువంటి సంఘటనలను అలాగే చెడు సంఘటనలను కూడా గుర్తు చేసుకుంటూ ఈ ఏడాదికి స్వస్తి పలుకుతున్నారు.
ఇకపోతే సినిమా ఇండస్ట్రీలో కూడా ఎన్నో విజయవంతమైన సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.అలాగే భారీ బడ్జెట్ లోఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి కొన్ని సినిమాలు డిజాస్టర్ గా కూడా నిలిచాయి ఇలా హిట్ అయిన సినిమాలు అలాగే ఫ్లాప్ అయిన సినిమాలను గురించి కూడా అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు.మరి 2023వ సంవత్సరంలో ఏకంగా 45 కోట్లతో తెరకెక్కిన సినిమా కనీసం నాలుగు లక్షల కలెక్షన్స్ కూడా రాబట్ట లేక చెత్త సినిమాగా రికార్డు సొంతం చేసుకుంది మరి అలాంటి భారీ డిజాస్టర్ ఎదుర్కొన్నటువంటి ఆ సినిమా ఏంటి అనే విషయానికి వస్తే…
బాలీవుడ్ చిత్రం లేడీ కిల్లర్ ( Lady Killer ) ఫస్ట్ ప్లేసులో నిలుస్తుంది.2023లో వచ్చిన అత్యంత పరమ చెత్త సినిమాగా నిలిచింది.బాలీవుడ్ యంగ్ హీరో అర్జున్ కపూర్( Arjun Kapoor ) .భూమి ఫడ్నేకర్ (Bhumi fadnekar) ఈ సినిమాలో హీరో హీరోయిన్లుగా నటించారు.వారితో పాటు బడా స్టార్లు కూడా ఈ సినిమాలో చేశారు.
ఈ సినిమా భారీ బడ్జెట్ సినిమా అనే చెప్పాలి ఈ సినిమా కోసం మేకర్స్ ఏకంగా 45 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేశారు ఇలా ఎన్ని కోట్ల రూపాయలతో తెరకెక్కినటువంటి ఈ సినిమా కేవలం రెండు లక్షల రూపాయల కలెక్షన్స్ రాబట్టి చెత్త సినిమాగా రికార్డు సొంతం చేసుకుంది.
ఇలా ఈ సినిమా ఏ మాత్రం కలెక్షన్స్ రాబట్ట లేకపోవడంతో నిర్మాతలకు కూడా భారీ స్థాయిలోనే నష్టాలు వచ్చాయని తెలుస్తుంది.ఇలా నిర్మాత భారీ మొత్తంలో నష్టాలు అందుకోవడంతో ఈ ఏడాది అత్యంత చెత్త సినిమాగా ఈ సినిమా రికార్డు ఎక్కింది.చాలా సినిమాలు ఫ్లాప్ అయినప్పటికీ ఏ సినిమా కూడా ఈ రేంజ్ లో డిజాస్టర్ టాక్ అలాగే డిజాస్టర్ కలెక్షన్లను అందుకోలేదని చెప్పాలి.