మౌనరాగం సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు బుల్లితెర నటిగా పరిచయమయ్యారు ప్రియాంక జైన్ ( Priyanka Jain ).ఈ సీరియల్స్ ద్వారా ఈమె ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.
ఈ సీరియల్ తర్వాత జానకి కలగనలేదు సీరియల్ ద్వారా మరింత గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈమె బిగ్ బాస్ అవకాశాన్ని అందుకున్నారు.ప్రస్తుతం బిగ్ బాస్ ( Bigg Boss ) కంటెస్టెంట్ గా మరింత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.
హౌస్ లో ఎంతో హుందాగా కొనసాగుతూ తన లిమిట్స్ ఏమాత్రం క్రాస్ చేయకుండా అందరి పట్ల ఎంతో మంచిగా వ్యవహరిస్తున్నటువంటి ఈమె టాప్ ఫైవ్ కంటెస్టెంట్ గా చేరుకున్నారు.
ఇకపోతే ఇటీవల కాలంలో ప్రియాంక గురించి సోషల్ మీడియాలో కొందరు పని కట్టుకొని ట్రోల్ చేస్తున్నారు.ముఖ్యంగా ఈమె బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన తర్వాత ముంబైలో వారు ఉంటున్నటువంటి హోమ్ టూర్ ( Home Tour ) వీడియో చేయడంతో కొందరు సింపతి కోసమే ఇలాంటి హోం టూర్ వీడియో చేసే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు అంటూ ఆమె ట్రోల్ చేశార.అయితే ఈ ట్రోల్స్ పై ఆమె ప్రియుడు శివకుమార్ ( Shiva Kumar ) స్పందించారు.
ముందుగా అందరికీ చెప్పాల్సిన విషయం ఏంటంటే ఈ హోమ్ టూర్ వీడియో చేసినప్పుడు ప్రియాంకకు బిగ్ బాస్ అవకాశం కూడా రాలేదని ఈయన తెలియజేశారు.
ప్రియాంక తల్లిదండ్రులు చాలా పేదరికంలో ఉన్నవారు ప్రియాంక తండ్రిని వ్యాపారంలో ఒక వ్యక్తి మోసం చేయడంతో ఉన్న ఆస్తులన్నింటిని అమ్మేసి వాళ్ళు బెంగుళూరులో ఒక అద్దె ఇంట్లో ఉంటున్నారు.ఆ ఇంటికి 15వేల రూపాయలు అద్దే ప్రియాంకనే చెల్లిస్తుందని తెలిపారు.తన తండ్రి మొబైల్ షాప్ పెట్టుకొని ఉండగా తన తల్లి ఇప్పటికీ పెళ్లిళ్లకు వెళ్లి పెళ్లి కూతుర్లకు మెహందీ పెట్టడం, మేకప్ వేయడం వంటివి చేస్తున్నారని వాళ్లు చాలా పేదరికం నుంచి ఈ స్థాయికి వచ్చారు అంటూ వారి తల్లిదండ్రులు పడే ఇబ్బందుల గురించి శివ తెలియజేశారు.
ఇక బిగ్ బాస్ కార్యక్రమంలో వాళ్ళు కొన్నిసార్లు కొట్టుకుంటారు మరి కొంతసేపటికి మాట్లాడుతారు అలాంటి వారి గురించి మనం ట్రోల్స్ చేయడం మంచిది కాదని తన గురించి ఎవరు ఎన్ని ట్రోల్స్ చేసిన వాటిని ఎదుర్కోవడానికి నేను ముందు ఉంటాను అంటూ ఈ సందర్భంగా ప్రియాంక పట్ల వస్తున్నటువంటి ట్రోల్స్ గురించి శివకుమార్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.