ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 6.40
సూర్యాస్తమయం: సాయంత్రం.5.38
రాహుకాలం: మ.3.00 సా4.30
అమృత ఘడియలు: అమావాస్య మంచిది కాదు.
దుర్ముహూర్తం: ఉ.8.32 ల9.23 ల11.15 సా 12.00
మేషం:
ఈరోజు మీకు ఆర్థికపరంగా నష్టాలు ఎదురవుతాయి.అనవసరమైన కొనుగోలు చేయడం వల్ల ఖర్చు పెరుగుతుంది.మీ కుటుంబ సభ్యులు ఒకరి ఆరోగ్యం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది.కొన్ని సమస్యల వల్ల మనశ్శాంతి కోల్పోతారు.ఈరాశికి చెందిన విద్యార్థులకు తమ చదువు పట్ల ఈరోజు అనుకూలంగా ఉంది.
వృషభం:
ఈరోజుతో మీ కోర్టు సమస్యలన్నీ తీరిపోతాయి.మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండడమే మంచిది.స్థలం కొనుగోలు చేసే ఆలోచనలో ఉంటారు.
బయట ఇచ్చిన డబ్బులు ఇచ్చినట్టుగా తిరిగి మీ చేతికందుతుంది.చాలా సంతోషంగా ఉంటారు.కొన్ని దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.
మిథునం:
ఈరోజు మీరు విలువైన వస్తువుల కోల్పోయే అవకాశం ఉంది.ఇంటి నిర్మూలన గురించి కుటుంబ సభ్యులతో చర్చలు చేస్తారు.కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండటం మంచిది.
మీ పాత స్నేహితులు ఈరోజు మిమ్మల్ని కలుస్తారు.మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండటమే మంచిది.
కర్కాటకం:
ఈరోజు మీకు కొందరి గొప్ప వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి.కొన్ని కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి వారితో చర్చలు చేస్తారు.ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తే అంతా మంచి జరుగుతుంది.తోటి వారి సహాయం మీకు ఎప్పుడూ అందుతుంది.కొన్ని ఉత్సాహపరిచే కార్యక్రమాల్లో పాల్గొంటారు
సింహం:
ఈరోజు మీరు ఇతరులు చెప్పిన మాటలకు మోసపోకండి.వ్యవసాయదారులు ఈరోజు నష్టపోయే అవకాశం ఉంది.కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.కుటుంబ సభ్యులతో కలిసి దైవ దర్శనం చేసుకుంటారు.స్నేహితులతో ఎక్కువ సమయాన్ని గడుపుతారు.చాలా ఉత్సాహంగా ఉంటారు.
కన్య:
ఈరోజు మీరంటే గిట్టని వారు మీపై నిందలు మోపుతారు.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.కానీ తిరిగి సంపాదించే సోమత మీలో ఉంటుంది.ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.వర్గ సంబంధిత విభేదాలు జరిగే అవకాశం ఉంది.కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.
తుల:
ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి బయట సమయాన్ని కాలక్షేపం చేస్తారు.కొన్ని వ్యక్తిగత విషయాలు మీ తోబుట్టువులతో పంచుకోండి.స్నేహితుల వలన కొన్ని సమస్యల నుండి బయట పడతారు.ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.లేదంటే కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు.
వృశ్చికం:
ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.మీలో బలహీనత ఈరోజు ఎక్కువగా ఉంటుంది.తరచూ మారే మీ నిర్ణయాల వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.మీరు ఏ పని మొదలు పెట్టిన నిదానంగా పూర్తి చేస్తారు.
ధనుస్సు:
ఈరోజు మీరు ఏదైనా పని మొదలు పెడితే కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.
కుటుంబ సభ్యులతో కాస్త సమయాన్ని గడపాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తులతో మాట్లాడాలి.
మకరం:
ఈరోజు మీరు ధనాన్ని పొదుపు చేయాలి.అవసరమైన వస్తువులు కొనుగోలు చేయాలి.కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్య గురించి జాగ్రత్తలు తీసుకోవాలి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.లేదంటే కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.
కుంభం:
ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉన్నాయి.ఇంటికి సంబంధించి ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.పెద్దవారితో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి.
మీనం:
ఈరోజు మీరు కొన్ని ఉత్సాహపరిచే కార్యక్రమాల్లో పాల్గొంటారు.దీనివల్ల సంతోషంగా ఉంటారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి.
ముఖ్యమైన విషయాల గురించి అనుభవం ఉన్న వ్యక్తులతో మాట్లాడుతారు.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.
చాలా ఉత్సాహంగా ఉంటారు.
LATEST NEWS - TELUGU