ఈ మధ్యకాలంలో డబ్బు లేనిదే ఏ ఒక్క పని కూడా అసలు జరగదు.ప్రతిదీ డబ్బుతో ముడిపడే ఉంటుంది.
ఇంట్లో ఎప్పుడు కూడా డబ్బు ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు.డబ్బుతోనే సమాజంలో బంధువుల మధ్య గౌరవం వస్తుంది.
డబ్బు ఉంటేనే ఏ పని అయినా జరుగుతుంది.డబ్బు లేకుంటే మనం ఎక్కడికి వెళ్లలేము.
ముందుకు సాగలేము.అయితే ఈ మధ్య కాలంలో చాలా మంది డబ్బు కొరకు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఎంతో కష్టపడుతూ ఉన్నారు.
డబ్బు ఉంటే ఏదైనా చేయవచ్చని కేవలం డబ్బు కోసం అన్నిటినీ మరిచిపోయి ఎంతో కష్టపడి ప్రతి ఒక్కరు కూడా సంపాదిస్తూ ఉన్నారు.అయినప్పటికీ కూడా ఈ రోజుల్లో డబ్బు కొరత ఉంటూనే ఉంది.
![Telugu Basil, Devotional, Dreams, Goddess Lakshmi-Latest News - Telugu Telugu Basil, Devotional, Dreams, Goddess Lakshmi-Latest News - Telugu](https://telugustop.com/wp-content/uploads/2023/12/Goddess-Lakshmi-Basil-plantmoney-devotional.jpg)
అయితే ఇంట్లో నిరంతరం డబ్బు నిలవాలంటే మనకు లక్ష్మీదేవి( Goddess Lakshmi ) అనుగ్రహం కావాలి.దీని కోసం చాలామంది లక్ష్మీదేవినీ ప్రసన్నం చేసుకోవడానికి ఈ పూజలు చేస్తూ ఉంటారు.అయితే కొన్ని రకాల సంకేతాలు కనిపించిన వినిపించిన లక్ష్మీదేవి ప్రసన్నం కలుగుతుందని,అలాగే ఇంట్లో డబ్బుకు ఎలాంటి లోటు ఉండదని స్వప్న శాస్త్రం చెబుతుంది.అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
కలలో పసుపు, తెలుపు రంగు పాములు కనిపిస్తే త్వరలోనే మీరు ధనవంతులవుతున్నారని అర్థం.అంతేకాకుండా మీ ఆరోగ్యపరంగా ఎలాంటి నష్టాలు కూడా ఉండవని సూచన.
ఇక కలలో చీపురు, గుడ్లగూబ, బల్లి, గులాబీ, ఏనుగు, శంఖం లాంటివి కనిపిస్తే సంపద కలుగుతుందని స్వప్న శాస్త్రం చెబుతోంది.
![Telugu Basil, Devotional, Dreams, Goddess Lakshmi-Latest News - Telugu Telugu Basil, Devotional, Dreams, Goddess Lakshmi-Latest News - Telugu](https://telugustop.com/wp-content/uploads/2023/12/Goddess-Lakshmi-Basil-plantmoney-dreams.jpg)
సాధారణంగా చెప్పాలంటే కుడి చేతిలో దురద వస్తే మంచిది కాదని పెద్ద వారు చెబుతూ ఉంటారు.కానీ అలా కుడి అర చేతిలో దురద వస్తే మాత్రం త్వరలోనే మీ చేతికి డబ్బు రాబోతుందని అర్థం.అలాగే కొన్ని నమ్మకాల ప్రకారం మూడు రకాల బల్లులు ఒకే ప్రదేశంలో కనిపిస్తే మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది.
అలాగే తులసి మొక్క( Basil plant ) చుట్టూ బల్లులు కనిపించినా కూడా శుభప్రదం అని చెబుతారు.అంతేకాకుండా కలలో నల్ల చీమలు మీ ఇంట్లోకి క్యూ కట్టిన, పక్షి మీ ఇంటి చుట్టుపక్కల గూడు కట్టిన దీన్ని శుభ సూచకంగా భావిస్తారు.
ఈ విధంగా పలు రకాల సంకేతాలు కనిపించిన, వినిపించిన మీ ఇంట్లోకి డబ్బు( money ) రాబోతుందని అర్థం చేసుకోవాలని స్వప్న శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
DEVOTIONAL