తెలంగాణ వ్యాప్తంగా అసెంబ్లీ పోలింగ్ మందకొడిగా కొనసాగుతోంది.పోలింగ్ కు రెండు గంటలు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో ప్రజలు అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎన్నికల అధికారులు సూచించారు.
ఇక సమస్యాత్మక నియోజకవర్గాల్లో మరో గంటలోనే పోలింగ్ ముగియనుంది.ఈ క్రమంలో మధ్యాహ్నం ఒంటి గంట వరకు రాష్ట్రంలో 36.68 శాతం పోలింగ్ నమోదు అయింది.అత్యధికంగా మెదక్ జిల్లాలో 50.80 శాతం పోలింగ్ నమోదు అయింది.ఆదిలాబాద్ జిల్లాలో 41.88 శాతం, జోగులాంబ గద్వాల్ 49.29 శాతం, కామారెడ్డిలో 40.78 శాతం, ఖమ్మంలో 42.93 శాతం, మహబూబ్ నగర్ లో 44.93 శాతం, హైదరాబాద్ లో 20.79 శాతం నమోదు అయింది.అయితే గతంతో పోలిస్తే ఈ ఎన్నికల్లో మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి ఓటింగ్ శాతం తగ్గిందని సమాచారం.