హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి నెలలో ఒక పౌర్ణమి వస్తుంది.కాబట్టి సంవత్సరానికి 12 పున్నమిలు లేదా 13 పున్నమిలు వస్తాయి.
సనాతన ధర్మంలో వచ్చే ప్రతి పౌర్ణమి ఎంతో ముఖ్యమైనది.ఒక్కొక్క పౌర్ణమికి ఒక్కొక్క పేరు ఉంటుంది.
కార్తీకమాసంలో వచ్చే పౌర్ణమి హిందువులకు ఎంతో ప్రత్యేకమైనది.ఎందుకంటే కార్తీకమాసన్ని శివకేశవులను పూజించడానికి ఉత్తమమైన మాసంగా పరిగణిస్తారు.
ఈ రోజున నదిలో చేసే స్నానం, దీపారాధన, దానం అత్యంత విశిష్టమని పండితులు చెబుతున్నారు.దీని వల్ల యాగం చేసిన పుణ్య ఫలితం లభిస్తుందని కూడా చెబుతున్నారు.
కార్తిక పౌర్ణమి నవంబర్ 27వ తేదీన సోమవారం రోజు వచ్చింది.కార్తీక పౌర్ణమి రోజున ధార్మిక కార్యక్రమాలు చేయడం వల్ల విశేష పుణ్యం ఫలము లభిస్తుందని పండితులు చెబుతున్నారు.
![Telugu Devotional, Karthika Masam, Karthikeya, Lord Shiva, Tarakasura-Latest New Telugu Devotional, Karthika Masam, Karthikeya, Lord Shiva, Tarakasura-Latest New](https://telugustop.com/wp-content/uploads/2023/11/Karthika-Pournami-Karthika-masam-devotional-karthikeya-Shiva.jpg)
అలాగే దానధర్మాలు చేయడం వల్ల సిరిసంపదలు పెరుగుతాయని, ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారని పండితులు చెబుతున్నారు.కార్తీక పౌర్ణమి శుభ సమయం ఇప్పుడు తెలుసుకుందాం.పురాణాల ప్రకారం కార్తికేయుడు( karthikeya ) తారకాసురుడు అనే రాక్షసుడిని సంహరించాడు.ఆ తర్వాత తారకాసురుడు ముగ్గురు కుమారులు తారకాక్షుడు, కమలాక్షుడు, విద్యున్మాలి లను త్రిపురాసురులు అని పిలుస్తారు.
వీరు బ్రహ్మ దేవుడి కోసం తపస్సు చేసి ఒక నగరం నిర్మించి ఇవ్వమని కోరారు.అంతరిక్షంలో తిరుగుతూ 1000 సంవత్సరాల కు ఒకసారి కలుసుకున్న సమయంలో ఒకే బాణంతో ఎవరు మూడింటిని ధ్వంసం చేయగలరో వారి వల్ల మాత్రమే మరణం కలిగేట్టు వరం పొందారు.
ఈ వరం పొందిన తర్వాత త్రిపురాసురులు మూడు లోకాలను స్వాధీనం చేసుకున్నారు.
![Telugu Devotional, Karthika Masam, Karthikeya, Lord Shiva, Tarakasura-Latest New Telugu Devotional, Karthika Masam, Karthikeya, Lord Shiva, Tarakasura-Latest New](https://telugustop.com/wp-content/uploads/2023/11/Karthika-Pournami-Karthika-masam-devotional-karthikeya-Lord-Shiva.jpg)
ఆ తర్వాత కార్తీక పున్నమి రోజున శివుడు( Lord Shiva ) ఒకే బాణం తో ముగ్గురు రాక్షసులను సంహరించాడు.ఆ తర్వాత శివుడిని త్రిపురగా పిలవడం మొదలుపెట్టారు.కార్తీక పున్నమి రోజున త్రిపురాసురులను సంహరించాడు.
కాబట్టి త్రిపుర పూర్ణిమ అని కూడా అంటారు.ఈ రోజున దేవుని దీపావళిని కూడా జరుపుకుంటారు.
కార్తీకమాసం పౌర్ణమి తేదీ నవంబర్ 26 ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల 53 నిమిషములకు మొదలై, నవంబర్ 27వ తేదీన సోమవారం మధ్యాహ్నం రెండు గంటల 45 నిమిషములకు ముగుస్తుంది.ఉదయ తిథి ప్రకారం నవంబర్ 27వ తేదీన సోమవారం రోజు పూర్ణిమ, ఉపవాసం, స్నానం ఆచరిస్తారు.
LATEST NEWS - TELUGU