తెలంగాణలో బీఆర్ఎస్, బీజేపీ( BRS , BJP ) రెండూ ఒక్కటేనని కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి అన్నారు.కేసీఆర్ కు ప్రజలను మోసం చేయడమే తెలుసని పేర్కొన్నారు.
కేసీఆర్ అవినీతిపై కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని విజయశాంతి ప్రశ్నించారు.కేసీఆర్( CM kcr ) సూచనలతోనే బీజేపీ అధ్యక్షుడిని మార్చారని ఆరోపించారు.
అలాగే మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగితే ఎందుకు చర్యలు లేవని ప్రశ్నించారు.అబద్ధాలు చెప్పడంలో కేసీఆర్ దిట్టని విజయశాంతి( Vijayashanti ) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.బీజేపీని కేసీఆర్ డిక్టేట్ చేస్తున్నారన్నారు.కానీ రానున్న రోజుల్లో కేంద్రం, రాష్ట్రంలో మార్పు రాబోతుందని ఆమె స్పష్టం చేశారు.