చరిత్రలో దానాలు చేసిన వారు ఎంతోమంది ఉంటారు.అందులో ముఖ్యంగా శిబి చక్రవర్తి ( Shibi Chakraborty )తన శరీరంలోని మాంసాన్ని కోసి దానం చేశాడు.
ఈ దానం పరుల శ్రేయస్సు కోసం ఆచరించాడు.అందువల్ల ఈ దానాన్ని తపస్సుగా పరిగణిస్తారు.
అక్రమ సంపాదనను దానంగా స్వీకరించడం వల్ల స్వీకరించిన వారిలో కూడా దుర్బుద్ధి కలుగుతుందని ఒక కథ ఉంది.ఒక ఊరిలో ఉండే బ్రాహ్మణుడు నిత్యం సంధ్యావందనం చేస్తూ సదాలోచనలతో జీవించేవాడు.
భోజనం చేసేటప్పుడు భగవంతుని స్మరించేవాడు.ఒకరోజు ఒక వర్తకుని అభ్యర్థన మేరకు వారి ఇంట ఎంతో సంతోషంగా కడుపునిండా తృప్తిగా పంచభక్షాపరమన్నాలు ఆరగించాడు.
భోజనం అంతా పూర్తయిన తర్వాత ఎవరు చూడకుండా ఒక వెండి గ్లాసును దొంగలించాడు.
ఇల్లు చేరుకున్న కొంతసేపటికి ఆ బ్రాహ్మణుడికి తను చేసిన పని గుర్తుకు వచ్చి అయ్యో ఇదేమిటి ఆ ఇంటి నుంచి వెండి గ్లాసులు తస్కరించాలని ఆలోచన నాకు ఎందుకు వచ్చింది అని ఆలోచించాడు.తనకు ఆదిత్యం ఇచ్చిన వర్తకుడు అక్రమంగా సంపాదించిన ధనంతో వడ్డించిన భోజనం చేయడం వల్లే తనకు ఆ ఆలోచన వచ్చిందని తెలుసుకున్నాడు.ఆ గ్లాసున వారికి అందజేసి ఇంటికి వచ్చేసాడు.
కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత ధర్మరాజు ఆశ మీద యాగం చేశాడు.వచ్చిన వారంతా ఇటువంటి యాగం ఎక్కడా చూడలేదు.
ఇటువంటి దానం ఎక్కడా స్వీకరించలేదు అని స్తుతించారు.అలా వచ్చిన వారంతా ధర్మరాజును( Dharmaraja ) పొగడ్తలతో ముంచెత్తుతున్న సమయంలో ఒక ముంగిస యాగవాటిక దగ్గరికి చేరి నేల మీద పొర్లు దండాలు ప్రారంభించింది.
ఆ ముంగిస రూపం విచిత్రంగా ఉంది.
శరీరంలో ఒక సగభాగం మామూలుగాను మరో సగభాగం బంగారు వర్ణంలోనూ ఉంది.అప్పుడు ఆ ముంగిస ఇలా చెప్పడం మొదలుపెట్టింది.అది కరువుకాలం ఒక రోజున ఏపాటిది కుటుంబం ఆకలి తీర్చుకునేందుకు కేవలం కుంచెడు పేలపిండి మాత్రమే ఉంది దానినే వారు నాలుగు భాగాలు చేసుకుని సక్తుప్రస్థుడి భార్యా, కొడుకు, కోడలు తినడానికి సిద్ధపడ్డారు.
సరిగ్గా అదే సమయంలో ఒక అతిధి ఆకలితో గుమ్మం ముందుకి వచ్చాడు.ఆ అతిథి ఆకలి తీర్చడానికి వారు నలుగురు ఒకరి తర్వాత ఒకరు వారి శరీర భాగాలను దానం చేశారు.
ఆ సమయంలో నేను అక్కడే ఉన్నాను.సక్తుప్రస్థుడు( Saktuprastha ) తన అతిథి కాళ్ళను కడిగి నీరు, పేలపిండి వాసన శరీరానికి సోకడంతో శరీరంలో సగభాగం బంగారంగా మారింది.
మిగతా శరీరం కూడా బంగారం కాకపోతుందా అని నేను ఇలా దానాలు జరిగే చోటకు వస్తాను అని చెప్పి వెళ్లిపోయింది.
LATEST NEWS - TELUGU