భగవంత్ కేసరి మూవీ( Bhagavanth Kesari ) ఫస్ట్ డే కలెక్షన్లు 32 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తంగా ఉన్నాయి.అయితే ఈ సినిమా భోళా శంకర్( Bhola Shankar ) ఫస్ట్ డే కలెక్షన్లను సైతం క్రాస్ చేయలేదని సోషల్ మీడియా వేదికగా జోరుగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
అయితే భగవంత్ కేసరి ఫస్ట్ డే కలెక్షన్లు చిరు డిజాస్టర్ మూవీని దాటలేకపోవడానికి కారణాలివేనంటూ కొన్ని కారణాలు వైరల్ అవుతున్నాయి.భగవంత్ కేసరి మూవీ గురువారం రోజున థియేటర్లలో విడుదలైంది.
ఈ సినిమా ఊహించని స్థాయిలో స్క్రీన్లను పంచుకోవాల్సి వచ్చింది.కొన్నిచోట్ల భగవంత్ కేసరి కంటే లియో మూవీకే ఎక్కువ బుకింగ్స్ జరిగాయి.
భోళా శంకర్ మూవీ విడుదలైన సమయంలో ఇలాంటి పరిస్థితి లేదు.జైలర్ సినిమా( Jailer ) పెద్దగా అంచనాలు లేకుండానే ఇక్కడి థియేటర్లలో విడుదల కావడం గమనార్హం.
భగవంత్ కేసరి ఫస్ట్ డే షేర్ కలెక్షన్ల విషయానికి వస్తే 18.10 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించింది.తొలిరోజు కలెక్షన్లలో ఫిక్స్డ్ హైర్లు కూడా ఉంటాయి కాబట్టి ఈ స్థాయిలో కలెక్షన్లు వచ్చాయి.నైజాంలో ఈ సినిమా 4 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను సాధించడం గమనార్హం.
తొలిరోజే 25 శాతం టార్గెట్ ను పూర్తి చేసిన భగవంత్ కేసరి మిగతా రోజుల్లో సైతం అదిరిపోయే కలెక్షన్లను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.
భగవంత్ కేసరి సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే సినిమా కాగా ఫుల్ రన్ లో ఈ సినిమా కలెక్షన్లు భారీగానే ఉండనున్నాయి.భగవంత్ కేసరి బాలయ్య కెరీర్( Balakrishna Career ) లో మరో స్పెషల్ మూవీగా నిలిచే ఛాన్స్ అయితే ఉందని మరి కొందరు చెబుతున్నారు.బాలయ్యను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.
బాలయ్య భవిష్యత్తు సినిమాలు భారీ లెవెల్ లో ఉండనున్నాయని సమాచారం అందుతోంది.