ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 6.14
సూర్యాస్తమయం: సాయంత్రం.5.47
రాహుకాలం: ఉ.10.30 మ12.00
అమృత ఘడియలు: ఉ.6.00 ల8.00 సా4.40 ల 6.00
దుర్ముహూర్తం: ఉ.8.32 ల9.23 మ12.48 ల 1.39
మేషం:
ఈరోజు మీకు కొందరి గొప్ప వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి.కొన్ని కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి వారితో చర్చలు చేస్తారు.ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తే అంతా మంచి జరుగుతుంది.తోటి వారి సహాయం మీకు ఎప్పుడూ అందుతుంది.ధైర్యంతో ముందుకు వెళ్లాలి.
వృషభం:
ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.
సమయాన్ని వృధా చేయకండి.మీరంటే గుట్టని వారు మీ విషయాలు జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు.
మిథునం:
ఈరోజు మీరు ఏ పని చేసిన అది వాయిదా పడే అవకాశం ఉంది.ఇతరులతో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.వ్యాపారస్తులు ఎక్కువ లాభాలు అందుకుంటారు.సొంత నిర్ణయాలు తీసుకోకండి.
కర్కాటకం:
ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు.కొన్ని అవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.
అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.వ్యాపారస్తులకు కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.కొన్ని ప్రయాణాలు చేయాల్సింది.
సింహం:
ఈరోజు మీరు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు.తీరికలేని సమయం గడుపుతారు.విశ్రాంతి లేకపోయేసరికి మనశ్శాంతి కోల్పోతారు.
వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ఇతరుల సహాయం అందుతుంది.మీరు పనిచేసే చోట పై అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు.
కన్య:
ఈరోజు మీరు ఇతరుల నుండి సహాయాన్ని పొందుతారు.ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఆలోచనలు చేయాలి.మీరు పనిచేసే చోట కాస్త ఒత్తిడి ఉంటుంది.కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.
తుల:
ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల మనశ్శాంతి కలుగుతుంది.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.కొన్ని పనులు వాయిదా పడతాయి.ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది.
వృశ్చికం:
ఈరోజు మీకు ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.అనుకోకుండా ఇతరుల నుండి సహాయం పొందుతారు.మీ పాత స్నేహితులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తారు.
దీనివల్ల కాస్త మనశ్శాంతి కలుగుతుంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఆలోచించాలి.
ధనుస్సు:
ఈరోజు మీకు అనుకులంగా ఉంది.ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.ఇంటికి సంబంధించిన ముఖ్యమైన వస్తువులు కొంటారు.కుటుంబ సభ్యులతో కలిసి దైవ దర్శనం వంటి ప్రయాణాలు చేస్తారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.పరిస్థితులు అనుకూలంగా ఉంది.చాలా సంతోషంగా ఉంటారు.
మకరం:
ఈరోజు మీకు ఇతరుల నుండి లాభాలు ఉంటాయి.అప్పుగా తీసుకున్న సొమ్మును తిరిగి ఇస్తారు.కొన్ని దూర ప్రయాణాలు చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది.
సంతానం పట్ల ఆలోచన చేయాలి.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.దీనివల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు.
కుంభం:
ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ నష్టాలు ఎదుర్కొంటారు.అనవసరమైన వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేస్తారు.తీరికలేని సమయం గడపడం వల్ల విశ్రాంతి దొరుకుతుంది.
కొన్ని ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి.ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.లేదంటే కొన్ని సమస్యలు ఎదురుకుంటారు.
మీనం:
ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు పొందుతారు.కొన్ని దూర ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.ఇంటికి సంబంధించి ముఖ్యమైన వస్తువులు కొంటారు.
కొన్ని వస్తువులు చేజారకుండా జాగ్రత్తగా చూసుకోవాలి.వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు లాభాలు అందుకుంటారు.
DEVOTIONAL