వినాయక నిమజ్జనంపై తెలంగాణ హైకోర్టులో మరోసారి విచారణ జరిగింది.ఈ మేరకు న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది.
హుస్సేన్ సాగర్, చెరువులలో పీఓపీ విగ్రహాలు నిమజ్జనం చేయొద్దని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.అదేవిధంగా హైకోర్టు ఉత్తర్వులు యథాతథంగా అమలు చేయాలని సీపీ, జీహెచ్ఎంసీ కమిషనర్ కు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.
పీఓపీ విగ్రహాలను కృత్రిమ నీటి కుంటలలో నిమజ్జనం చేయాలని ఆదేశించింది.కాగా హైదరాబాద్ లో ఈనెల 28వ తేదీన గణేశ్ నిమజ్జనం జరగనున్న సంగతి తెలిసిందే.