బాలనటిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన శృతిహాసన్ ( Sruthi Haasan ) కేవలం హీరోయిన్ గానే కాకుండా సింగర్ గా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.అలాంటి ఈ ముద్దుగుమ్మ తండ్రి పెద్ద నటుడు అయినప్పటికీ తండ్రి సహాయ సహకారాలు ఏమాత్రం తీసుకోకుండా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా పేరుగాంచింది.
ఇక ఈ ఏడాది విడుదలైన వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి ( Veera simha reddy ) వంటి రెండు సినిమాలు శృతిహాసన్ కి మంచి హిట్ ఇచ్చాయి.ప్రస్తుతం శృతిహాసన్ హాయ్ నాన్న అలాగే పాన్ ఇండియా మూవీ సలార్ లో నటిస్తుంది.
ఇదంతా పక్కన పెడితే శృతిహాసన్ సినిమాల్లోకి రాకపోతే ఏం పని చేసేది అనే విషయాన్ని తాజాగా తన అభిమానులతో పంచుకుంది.ఇక శృతిహాసన్ సినిమాలు కాకుండా చేసే పని ఏంటో తెలిస్తే మీరందరూ ఆశ్చర్యపోతారు.
ఇక అసలు విషయంలోకి వెళ్తే.శృతిహాసన్ ( Sruthi Haasan ) తన అభిమానులతో ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ముచ్చటిస్తూ ఉంటుంది.ఇప్పటికే ఎన్నోసార్లు తన అభిమానులు అడిగిన ప్రశ్నలకు జవాబులు ఇచ్చింది.అయితే తాజాగా కొంతమంది నెటిజెన్స్ ఆమెను సోషల్ మీడియా ఖాతాలో ప్రశ్నించగా వాటికి ఆన్సర్లు చెప్పింది.
ఇక అందులో ఓ నెటిజన్ మీరు సినిమాల్లోకి రాకపోతే ఏం పని చేసేవారు అని అడిగితే నేను సినిమాల్లోకి రాకపోతే కచ్చితంగా సేల్స్ ఉమెన్ గా పనిచేసేదాన్ని.
ఎందుకంటే నాకు చిన్నప్పటినుండి బట్టల షో రూమ్ లో సేల్స్ ఉమెన్ గా ( Sales woman )చేయడం చాలా ఇష్టం.వచ్చిన కస్టమర్లతో ముచ్చట్లు పెట్టుకుంటూ సరదాగా గడపడం అంటే నాకు ఎంతో ఇష్టం అంటూ ఆన్సర్ ఇవ్వడంతో చాలామంది నెటిజన్స్ ఈమె ఆన్సర్ విని నవ్వుకున్నారు. శాంతాను హాజరిక ( Shanthanu hajarika ) కి తనకి సోషల్ మీడియాలో పరిచయం ఏర్పడిందని,అది కాస్త ప్రేమగా మారిందని చెప్పింది.
అంతేకాకుండా పెళ్లి పై అభిప్రాయాన్ని అడిగితే బోరింగ్ అంటూ ఆన్సర్ ఇచ్చింది.ఇక ఓ నెటిజన్ అయితే మీకు టాటూలు అంటే అంతగా ఇష్టమా అని అడిగితే.
నాకు టాటూస్ వేయించుకోవడం అంటే చాలా ఇష్టం.ఒకవేళ నేను హీరోయిన్ కాకపోతే కచ్చితంగా ఫేస్ కి తప్ప మిగతా బాడీ మొత్తం టాటూస్ వేయించుకునేదాన్ని అంటూ ఆన్సర్ ఇచ్చింది.