చాలా మందికి పూజ చేసే పూలను( flowers ) వాసన చూడకూడదని తెలుసు కానీ ఎందుకు చూడకూడదు అనే విషయం గురించి చాలామందికి తెలియదు.అలాగే ఏ పువ్వులతో పూజ చేస్తే మంచిదో కూడా చాలామందికి తెలియదు.
ఆ విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.హిందువులు భగవంతునికి ఎంతో ప్రాముఖ్యతను ఇస్తారు.
పండుగలు వచ్చాయంటే ఇల్లు పూలతో కలకలలాడిపోతూ ఉంటాయి.చాలామంది ప్రతి రోజు పూజ చేయకుండా కనీసం పచ్చి మంచినీళ్లు కూడా తీసుకోరు.
అయితే పూజ చేసేటప్పుడు దీపం, అగరవత్తులు ఎంత ముఖ్యమో పూలు అంతకన్నా ఎక్కువ.
ముఖ్యంగా చెప్పాలంటే పూజకు తప్పనిసరిగా ఒక పుష్పం ఉండాలి అని పెద్దవారు చెబుతూ ఉంటారు.అలా దేవునికి సమర్పించే పుష్పాలని వాసన( smell of flowers ) చూడకూడదని పిల్లలకు పెద్దవారు చెబుతూ ఉంటారు.కానీ కారణం మాత్రం చాలా మందికి తెలియదు.
ఆ కారణమేమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.పువ్వులు దైవ శక్తిని ఆకర్షిస్తాయని చాలామంది ప్రజలు నమ్ముతారు.
నిర్దిష్ట దేవతల( certain deities ) పవిత్రతను ఆకర్షించగల సామర్థ్యాన్ని పువ్వులు కలిగి ఉంటారు.అటువంటి పుష్పాలని భగవంతునికి సమర్పించినప్పుడు విగ్రహం లోని భగవంతుని చైతన్యం నుంచి మనం వెంటనే ప్రయోజనం పొందుతాము.
అలాంటి పువ్వులను మనం వాసన చూడటం వల్ల ఆ పువ్వులకి ఉన్న పవిత్రత పోతుందని పెద్దవారు నమ్ముతారు.అలాగే కిందపడినప్పుడు కూడా ఆ పవిత్రతను కోల్పోతుంది.అలాంటి పూలను కూడా భగవంతునికి సమర్థించకూడదని పండితులు చెబుతున్నారు.అలాగే ఒక్కొక్క ఆదిదేవతకి ఒక్కొక్క ప్రీతిపాత్రమైన పూలు ఉంటాయి.వాటిని ఆయ దేవతలకు సమర్పించినప్పుడు మన కార్యసిద్ధి కూడా త్వరగా జరుగుతుంది.వినాయకుడికి తెల్ల జిల్లేడు పువ్వులు( White lilac flowers ) ఇష్టం.
కాబట్టి వాటితో పూజ చేయడం ఎంతో మంచిది.అలాగే పరమేశ్వరుడికి ఉమ్మెత్త పువ్వు అంటే ఎంతో ఇష్టం.
అలాగే కాళీమాతకి ఎర్రమందారం, మహావిష్ణువుకు పారిజాత పుష్పాలు అంటే ఎంతో ఇష్టం.ఈ పూలతో ఆయా దేవతలని పూజించడం వల్ల మనం అనుకున్న పనులు త్వరగా నెరవేరుతాయి.
అలాగే పక్కవారి ఇంట్లో వాళ్ళ అనుమతి లేకుండా పూలు కోసి ఆ పూలతో దేవుడినీ పూజించడం వల్ల పుణ్య ఫలితం మనకు దక్కదు.
DEVOTIONAL