హైదరాబాద్ లోని మాదాపూర్ డ్రగ్స్ పార్టీ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.ఇందులో భాగంగా సినిమా ఫైనాన్షియర్ వెంకట్ ఆధ్వర్యంలో డ్రగ్స్ పార్టీ జరిగినట్లు గుర్తించారు.
మాదాపూర్ విఠల్రావు నగర్లోని ఓ అపార్ట్మెంట్ లో డ్రగ్స్ పార్టీ జరుగుతుందన్న సమాచారంతో నార్కోటెక్ బ్యూరో అధికారులు దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే.ఈ దాడులలో భారీగా డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు.
అదేవిధంగా పలు సినిమాలకు ఫైనాన్షియర్ గా వ్యవహారించిన వెంకట్ తో పాటు పాటు బాలాజీ, వెంకటేశ్వర్ రెడ్డి, డి మురళీ, మధుబాల, మేహక్ లను అరెస్ట్ చేసి మాదాపూర్ పోలీస్ స్టేషన్ కు తరలించారని తెలుస్తోంది.కాగా గోవా నుంచి డ్రగ్స్ ను తీసుకువస్తున్నట్లు నార్కోటిక్ బ్యూరో అధికారులు భావిస్తున్నారు.
వెంకట్ పై గత మూడు నెలలుగా నిఘా పెట్టిన నార్కోటిక్ బ్యూరో అధికారులు ఇప్పటికే పలు పార్టీలు నిర్వహించినట్లు నిర్ధారించారు.అదేవిధంగా వెంకట్ కు డ్రగ్స్ పెడ్లర్లతో ఉన్న సంబంధాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.







