దివంగత హీరో ఉదయ్ కిరణ్( Uday Kiran ) గురించి మనందరికీ తెలిసిందే.ఈ తరం ప్రేక్షకులకు అంతగా తెలియక పోయినప్పటికీ ఆ తరం ప్రేక్షకులు ఉదయ్ కిరణ్ ను ఇట్టే గుర్తుపట్టేస్తారు.
ఉదయ్ కిరణ్ నటించినది తక్కువ సినిమాలే అయినప్పటికీ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు.ఒకప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హీరోగా, లవర్ బాయ్ గా మంచి ఇమేజ్ సంపాదించుకున్నాడు.
కాగా ఉదయ్ కిరణ్ ఎక్కువగా లవ్ సినిమా కథలలో నటించి లవర్ భాయ్ గా గుర్తింపు తెచ్చుకున్నారు.
ఉదయ్ కిరణ్ మనమధ్య లేకపోయినప్పటికీ ఆయన జ్ఞాపకాలు ఇంకా మన కళ్ళ ముందు మెదులుతూనే ఉన్నాయి.
కాగా ఉదయ్ కిరణ్ నటించిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ అయిన విషయం అందరికీ తెలిసిందే.ఆయన నటించిన నువ్వు నేను,( Nuvvu Nenu ) చిత్రం( Chitram ) వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని అనుకోవడంతో పాటు భారీ రికార్డులను క్రియేట్ చేసి అప్పటి స్టార్ హీరోలకు కూడా చెమటలు పట్టించాడు.
ఈ రెండు వచ్చిన సినిమాలు తర్వాత వచ్చిన వచ్చిన మూడో సినిమా మనసంతా నువ్వే సినిమా కూడా బాక్సాఫీస్ వసూళ్ళ సునామీని సృష్టించింది.ఇక ఉదయ్ కిరణ్ ఈ సినిమాలో నటించే సమయంలోనే స్టార్ హీరోలైన చిరంజీవి, వెంకటేష్ వరుస ప్లాప్‌లతో ఇబ్బంది పడ్డారు.
ఇక ఉదమ్ కిరణ్ నటించిన మనసంతా నువ్వే( Manasantha Nuvve ) సినిమా రిలీజ్ అయ్యే సమయంలోనే చిరంజీవి( Chiranjeevi ) నటించిన డాడీ, వెంకటేష్( Venkatesh ) నటించిన నువ్వు నాకు నచ్చావ్ సినిమాలు పెద్దగా సక్సెస్ అవ్వవు అని ఈ ఇద్దరు హీరోలు భావించారు.ఇక ఉదయ్ కిరణ్ మనసంతా నువ్వే సినిమా సెప్టెంబర్ రెండవ వారంలో రిలీజ్ చేయడానికి నిర్మాత ఎమ్మెస్ రాజు ఫిక్స్ అయ్యారట.ఇక ఈ సినిమాని రిలీజ్ చేస్తే చిరు- వెంకటేష్ నటించిన సినిమాలు పెద్దగా విజయం సాధించమని భావించిన ఈ స్టార్ హీరోలు ఉదయ్ కిరణ్ సినిమాని మా సినిమాలు రిలీజ్ చేశాక ఉదయ్ కిరణ్ సినిమాను రిలీజ్ చేయాలని ఇద్దరు హీరోలు నిర్మాత ఎమ్మెస్ రాజును కోరారట.
ఇక ఎమ్మెస్ రాజు( Producer MS Raju ) కూడా స్టార్ హీరోలు అడిగేసరికి చేసేదేమీ లేక మనసంతా నువ్వే సినిమాను వాయిదా వేసుకున్నారు.ఆ విధంగా డాడీ సినిమా రిలీజ్ అయిన రెండు వారాలకి నువ్వు నాకు నచ్చావ్ సినిమా రిలీజ్ అయింది.ఈ రెండు సినిమాల రిలీజ్ అయిన రెండు వారాలకి ఉదయ్ కిరణ్ నటించిన మనసంతా నువ్వే సినిమా రిలీజ్ అయి సూపర్ హిట్ గా నిలిచింది.
ఈ విధంగా ఉదయ్ కిరణ్ కెరీర్ మొదట్లోనే ఆయన క్రేజ్‌ను చూసి టాలీవుడ్ స్టార్ హీరోలు సైతం భయపడిపోయారట.అలా ఉదయ్ కిరణ్ తన సినిమాలతో చిరు, వెంకటేష్ లాంటి హీరోలకి చెమటలు పట్టించారు.