మూడు రాజధానుల కథ కంచికే ?

ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి( YS Jagan Mohan Reddy ) అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్నో సరికొత్త విధానాలను అమల్లోకి తీసుకొచ్చారు.వాలెంటరీ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ, డోర్ డెలివరీ, ఇలా చాలా వాటినే ప్రవేశ పెట్టారు.

 What Happened To The Three Capitals, Ys Jagan Mohan Reddy, Three Capitals , Amar-TeluguStop.com

ఇవన్నీ ప్రజల్లో చర్చనీయాంశంగా మారిన అంశాలే.ఇక ప్రజల్లో ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ గా మారే మరో అంశం మూడు రాజధానులు.

జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత పరిపాలనా వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చారు.దేశంలో ఎక్కడ లేని విధంగా ఈ ప్రస్తావన తీసుకురావడంతో ఇతర పార్టీల నుంచి, అలాగే మెజారిటీ ప్రజల నుంచి మూడు రాజధానులపై వ్యతిరేకత వ్యక్తమౌతూనే వచ్చింది.

పాలన ఒకే చోట కెంద్రీకృతం అయితే అభివృద్ది జరగదని అందుకే మూడు రాజధానులను ప్రవేశ పెట్టాలని జగన్ చాలాసార్లు చెప్పుకొచ్చారు.

Telugu Amaravati, Apbjp, Ap, Farmers, Kurnool, Ysjagan-Politics

అయితే ఇది విందానికి బాగానే ఉన్నప్పటికి ఆచరణలో అంత సులభం కాదనేది అందరూ చెబుతున్నా మాట.అయినప్పటికి జగన్ సర్కార్ మాత్రం త్రీ క్యాపిటల్స్ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ఇప్పటికే చాలాసార్లు స్పష్టం చేసింది.అయితే అమరావతి( Amaravati ) రాజధాని కొరకు భూములిచ్చిన రైతులు కోర్టును ఆశ్రయించడంతో త్రీ క్యాపిటల్స్ పై హై కోర్టు స్టే విధించింది.

దీంతో మూడు రాజధానుల అంశం ప్రస్తుతానికి హోల్డ్ లో పడింది.మరోవైపు ఎన్నికలు దగ్గర పడుతుండడంతో త్రీ క్యాపిటల్స్ విషయంలో జగన్ సర్కార్ ఏం చేయబోతుందనే చర్చ గట్టిగా జరుగుతోంది.

ఎందుకంటే ఎన్నికల కంటే ముందే మూడు రాజధానులను ప్రకటించాలనే ఆలోచనలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారు.కానీ పరిస్థితులన్నీ ప్రతికూలంగాణే కనిపిస్తున్నాయి.

Telugu Amaravati, Apbjp, Ap, Farmers, Kurnool, Ysjagan-Politics

దీంతో జగన్ వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయనేది ఆసక్తికరంగా మారింది.మరోవైపు మూడు రాజధానుల విషయంలో కేంద్రం కూడా జగన్ ను విభేదిస్తోంది.కేంద్రం అమరావతి రాజధానికే కట్టుబడి ఉందని ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి( Purandeswari ) ఇటీవల స్పష్టం చేశారు.అమరావతి రాజధాని అభివృద్ది కోసం కేంద్రం ఇప్పటికే రూ.2500 కోట్ల నిధులు ఇచ్చిందని, మూడు రాజధానులకు కేంద్రం పూర్తిగా వ్యతిరేకమని చెప్పుకొచ్చారామే.దీంతో న్యాయ పరంగాను, కేంద్రం పరంగాను, ప్రజల పరంగాను త్రీ క్యాపిటల్స్ అంశానికి ఎలాంటి అండా లేదు.

దీంతో మూడు రాజధానుల అంశం కథ కంచికే అని కొందరు విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube