ఇంట్లో వస్తువులు చిందర వందరగా ఉంటే.. మానసిక ఆరోగ్యం పై చెడు ప్రభావం పడుతుందా..!

ముఖ్యంగా చెప్పాలంటే చాలామందికి ఇల్లు చిందరవందరగా ఉంటే మనసంతా ఏదో చిరాకుగా అనిపిస్తూ ఉంటుంది.అదే ఇల్లు పరిశుభ్రంగా ఉంటే హాయిగా అనిపిస్తుంది.

 Cleanliness Of Your Home Effect Your Mental Health Details, Cleanliness, Home ,-TeluguStop.com

మీ ఇంటి పరిశుభ్రత మీ మానసిక ఆరోగ్యం పై( Mental Health ) చెడు ప్రభావాన్ని చూపిస్తుంది.చిన్నప్పుడు బొమ్మలతో ఆడుకున్నాక చక్కగా వాటిని సర్దాలి అని తల్లిదండ్రులు చెబుతారు.

వారు చెప్పే మాటల్లో ఎంతో అర్థం ఉంటుంది.ఇంట్లో ఎక్కడి వస్తువులు( Things ) అక్కడ ఉండి పరిశుభ్రంగా ఉంటే మనసుకి ఆహ్లాదంగా అనిపిస్తుంది.

పర్యావరణ పరిశుభ్రత, మానసిక ఆరోగ్యం పై ప్రభావాన్ని చూపిస్తుంది.మానసిక ఆరోగ్యం కోసం ఇంటిని శుభ్రంగా ఉంచుకోమని నిపుణులు చెబుతున్నారు.పరిసరాలు( Surroundings ) చిందరవందరగా ఉంటే మనసు బాగోనట్లు అనిపిస్తుంది.అలా ఉంటే ఒత్తిడి,ఆందోళన, ఏకాగ్రత లేకపోవడం వంటి వాటికి దారితీస్తుందని సైకాలజిస్ట్ లు చెబుతున్నారు.

గజిబిజిగా ఉన్న ఇంట్లో మానసిక ఆరోగ్యం సరిగా ఉండకపోవచ్చు.ఇంటిని చక్కగా సర్దుకోవడం వల్ల మంచి అనుభూతి కలుగుతుంది.

అందులోనా నిరాశలో ఉండేవారు ఇంటిని శుభ్రపరిచే పనులు చేస్తుంటే వారిలో అదనపు శక్తి చేకూరుతుందని వైద్యులు చెబుతున్నారు.

Telugu Bed, Clean, Cleanliness, Vastu, Energy, Vastu Tips-Latest News - Telugu

ముందుగా మీకు ఇష్టమైన ముఖ్యమైన గదిని ఎంచుకొని దాన్ని శుభ్రపరచుకోవాలి.అందరికీ ముఖ్యమైనది వంటగదితో శుభ్రం చేసుకోవడం మొదలుపెడితే మంచిది.ఆ తర్వాత పడక గది.( Bed Room ) ఇది ఆరోగ్యకరమైన నిద్ర అలవాట్లకు దోహదం చేస్తుంది.రోజు వారి పనులలో కొన్ని వస్తువులు లేదా దుస్తులను చిందరవందరగా కుప్పలుగా పోయకుండా చిన్నచిన్న మార్పుల ద్వారా పనులు తగ్గించుకుంటూ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి.

Telugu Bed, Clean, Cleanliness, Vastu, Energy, Vastu Tips-Latest News - Telugu

ఒక్కసారిగా అన్ని పనులు మీద వేసుకోకుండా డ్రాయర్, అల్మారా శుభ్రం చేసే పని తీసుకోవాలి.ఎందుకంటే ఒకేసారి అన్ని పనులు చేస్తే అలసట కలిగే అవకాశం ఉంది.ఇంటిని శుభ్రపరచడం అంటే చాలామంది తప్పించుకోవాలనుకుంటూ ఉంటారు.ప్రతిరోజు కొంచెంగా సర్దుకుంటూ ఉంటే ఒక్కసారిగా ఒత్తిడికి గురి కాకుండా ఉండవచ్చు.ఇల్లు శుభ్రపరచడం అనేది మనలో ఏకాగ్రతను పెంచడంతోపాటు క్లీన్ గా కనిపించే ప్రదేశంలో మనసుకు ఆనందాన్ని కూడా కలిగిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube