అతి తక్కువ రోజులు అసెంబ్లీ నడిపిన చరిత్ర తెలంగాణదే..: భట్టి

తెలంగాణ ప్రభుత్వంపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.యావత్ భారతదేశంలోనే అతి తక్కువ రోజులు అసెంబ్లీ నడిపిన చరిత్ర తెలంగాణ సర్కార్ దేనని విమర్శించారు.

 Telangana Has The History Of Running The Assembly For The Shortest Days..: Bhatt-TeluguStop.com

పోడు భూములు, ధరణి పోర్టల్, సింగరేణి, బీసీ సబ్ ప్లాన్ వంటి అంశాలపై అసెంబ్లీలో చర్చించాలన్నారు.అదేవిధంగా మైనారిటీ, ఎస్సీ సబ్ ప్లాన్ పై చర్చించడంతో పాటు ఇరిగేషన్ ప్రాజెక్టలపై చర్చ జరగాలని డిమాండ్ చేస్తామని చెప్పారు.

సభ ఎక్కువ రోజులు నడపాలని కోరుతూ స్పీకర్ కు లేఖ రాస్తామని తెలిపారు.ప్రజాస్వామ్య పద్ధతిలో సభను నిర్వహించాలని భట్టి డిమాండ్ చేశారు.

రుణమాఫీ వడ్డీతో సహా చెల్లించాలన్న ఆయన అసెంబ్లీ వేదికగా ఏ సమస్యలను లేవనెత్తాలో తమకు తెలుసని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube